Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తూనే ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు విషయంలో మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కేసుకు సంబంధించి వీడియోలు బహిర్గతం చేసిన వాళ్లపైనా కేసులు పెడుతున్నారు పోలీసులు. మైనర్ బాలిక కారులో నిందితులతో కలిసి ఉన్న వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ ను అరెస్ట్ చేశారు. రెండు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని ఆరోపిస్తూ.. అందుకు కొన్ని ఆధారాలు విడుదల చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మైనర్ బాలికతో పాటు నిందితులు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైనర్ బాలిక ఫోటోలు, వీడియో రిలీజ్ చేయడం నేరమంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ  నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు ఇచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని బండి సంజయ్ ప్రశ్నించారు.


బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న తొందర.. దోషులను అరెస్ట్ చేయడంలో చూపితే న్యాయం జరిగేదని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే  ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.  ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే హైదరాబాద్ అత్యాచారాలకు అడ్డాగా మారిందని సంజయ్ ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ గొంతు  ఇప్పుడు ఎందుకు మూగబోయిందని బీజేపీ చీఫ్ నిలదీశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు బండి సంజయ్.



 


Read also: Hyderabad Gang Rape: మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదు.. పోలీసులు ఏమన్నారంటే?


Read also: Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. మరో 1433 పోస్టుల భర్తీ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook