Hyderabad Job Mela : రేపే హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులు మిస్ చేసుకోకండి.. ఇదే గోల్డెన్ ఛాన్స్
Hyderabad Job Mela : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ కాప్స్ ముందున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Hyderabad Job Mela : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ కాప్స్ ముందున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. యువతి యువకుల వివరాలు సేకరించి.. వాళ్లకు సరిపడే జాబ్ వచ్చేలా చేశారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరుద్యోగుల కోసం భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూన్ 29 బుధవారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్ కవాడిగూడలోని హెరిటేజ్ ప్యాలెస్ లో ఈ జాబ్ మేళా జరగనుంది.
హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్ , TMI Group, Big Basket, Vijaya Diagnostic Center, Apollo Pharmacies Ltd వంటి మొత్తం 15 కంపెనీలు పాల్గొననున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా దాదాపు 15 వందల మందిని ఎంపిక చేసుకుంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జాబ్ మేళాలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం మూడు రోజుల క్రితమే ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. అభ్యర్థులు bit.ly/jcepassను ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. Job Application Formలో పేరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వయస్సు, ఫోన్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల 29న జరగనున్న జాబ్ మేళాకు రావాలని పోలీసులు సూచించారుయ
జాబ్ మేళా గురించి హైదరాబాద్ పోలీసులు భారీగానే ప్రచారం చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జాబ్ మేళాలో పాల్గొనడం కోసం ఇచ్చిన వెబ్ సైట్ లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలంగాణ పోలీసులు తెలిపారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. వేలాది మంది యువతి యువకులు ఉద్యోగాలు సాధించారు. ఈ సారి కూడా అనుకున్న దానికంటే సక్సెస్ అవుతుందనే ధీమాలో పోలీసులు ఉన్నారు.
READ ALSO: TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి
READ ALSO: KCR RAJBHAVAN: గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! రాజ్ భవన్ లో కేసీఆర్ సందడే సందడి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి