Hyderabad Big Python Viral Video: సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం పార్కులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. 14 అడుగుల పొడవైన కొండచిలువను చూసి పారిశ్రామిక సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్‌ క్యాచర్‌కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి భారీ కొండచిలువను సంచిలో బందించి తీసుకెళ్లారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్‌ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం 10-11 గంటల సమయంలో పార్కులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు. దీంతో చెత్తను ఎత్తివేస్తున్న సమయంలో అందులో కదలికలతో పాటు చిన్నపాటి శబ్దం వచ్చింది. కర్రల సాయంతో చెత్తను తొలగించి.. చూడగా 14 అడుగుల భారీ కొండచిలువ కనబడింది. దాంతో సిబ్బంది భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. రైల్‌ నిలయం పార్కు కాలనీ వారు స్నేక్‌ క్యాచర్‌ బృందానికి సమాచారం అందజేశారు.


సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ బృందం వెంటనే రైల్‌ నిలయం కాలనీ పార్కులోకి వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. ముందుగా ఓ సంచి వేసి తన పట్టుకుని.. ఆపై ఇద్దరు కలిసి దాన్ని పార్కు నుంచి బయటికి తీసుకొచ్చారు. కొండచిలువ 14 అడుగులు ఉండడంతో సంచిలో అది పట్టలేదు. దాంతో మరో పెద్ద సంచిలో బందించి తీసుకెళ్లారు. దీంతో రైల్‌ నిలయం కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.



రైల్‌ నిలయం కాలనీ పార్కులో ఎప్పుడూ జన సంచారం ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలు పార్కులో వాకింగ్‌కు వెళుతారని స్థానికులు చెప్పారు. కాలాక్షేపానికి కూడా పార్కుకు వస్తుంటారని.. పాములు ఇదివరకు ఎప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు. ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడం సంతోషంగా ఉందని కాలనీ వాసులు చెప్పారు. ఇకనుంచి ఎప్పటికప్పుడు కాలనీ పార్కులో చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.


Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ 2023 వేలం.. కోట్లు కొల్లగొట్టే ఆటగాళ్లు వీరే! భారత్ నుంచి ఎవరూ లేరు


Also Read: Eshanya Maheshwari Pics: హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న ఇశన్య.. అందాల అరాచకం మాములుగా లేదుగా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook