Hyderabad Rains: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Heavy rains in Hyderabad) కురిసింది. ఈ గాలులకు విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ  రఘుమారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో దక్షిణ డిస్కం పరిధిలోని విద్యుత్‌ అధికారులతో రఘుమారెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. నగరంలోని (Hyderabad) విద్యుత్‌ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించిన సీఎండీ... తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ సరఫార పునరుద్ధరణ పనులను చేపట్టారు అధికారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 చెట్ల మీద, వాహనాల మీద కరెంట్ వైర్లు పడితే వాటిని తాక వద్దని సూచించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటి జోలికి పోవద్దన్నారు. విద్యుత్‌ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ (control room) నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574లకు కాల్‌ చేసి కంప్లైంట్ చేయొచ్చన్నారు. 


Also Read: Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఏ ఏరియాలో ఎంత వర్షపాతం! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook