Hyderabad Software CEO Kidnapped: సాధారణంగా అందరూ పనిచేసేది జీతభత్యాల కోసం. దీనికి ఎన్నో కష్టాలు పడి చదువుకుని ఆశించిన ఉద్యోగం దొరకకున్నా ఉన్నదాంతో సర్దుకుపోదాం అని ఏదో ఉద్యోగంలో చేరతారు. అయితే, అక్కడ నెలంతా పనిచేసినా జీతం ఇవ్వకుంటే వారి పరిస్థితి ఏంటి? ఒకటి కాదు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఏదో ఒకసాకు చెబుతూ నెట్టుకువస్తున్న యాజమాన్యం తీరుకు విసిగిపోయిన ఉద్యోగులు ఏకంగా ఆ కంపెనీ సీఈఓకు ఊహించని ఝలక్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన కేసు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌ ఇనార్బిట్‌ మాల్‌కు ఎదురుగా ఉన్న టీ హబ్‌లోని గిగిలీయాస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈఓ రవిచంద్రారెడ్డి. హుడా కాలనీలో ఉంటారు. ఇదిలా ఉండగా ఈ నెల 10న రవిచంద్రా రెడ్డి రాత్రి స్నేహితుడు మోహన్, తల్లితో కలిసి డిన్నర్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి కొందరు వ్యక్తులు రవిచంద్రారెడ్డి, ఆయన స్నేహితుడు మోహన్‌ను బలవంతంగా అపహరించి లాక్కెల్లారు. తన తల్లి మాధవిని మాత్రం ఇంట్లోనే నిర్భందించారు. అయితే, రవిచంద్రారెడ్డి కారును కూడా తమతో పాటు తీసుకెళ్లారు.


ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర


అయితే, మరుసటిరోజు ఎలాగో అలా బయటకు వచ్చిన తల్లి మాధవి జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫూటేజీ, సిగ్నల్స్‌ ఆధారంగా నాగర్‌కర్నూల్‌లో ఉన్నట్లు తెలిసింది. అక్కడ ఓ హోటల్‌లో వారిని నిర్భందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని రక్షించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వనందుకు కడుపు మండిన కొంతమంది ఉద్యోగులు ఈ కిడ్నాప్‌ చేశారని తెలసింది. గిగ్‌లియాస్ సంస్థ  1500 మంది వ్యక్తులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఆశచూపి పనిచేయించుకున్నారు. కానీ, మూడు నెలల వరకు ఎలాంటి జీతభత్యాలు వారికి చెల్లించలేదు. దీంతో విసుగు చెందిన ఉద్యోగులు ఈ కిడ్నాప్‌కు ఒడిగట్టారు.


ఇదీ చదవండి:​  ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్.. జీతంలో 50 శాతం వరకు పెన్షన్‌కు ఛాన్స్..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook