Suncity Ganesh Laddu: గణేశ్ నిమజ్జనం అంటే ముందుగా గుర్తొచ్చేవి రెండే రెండు. ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ లడ్డూ. ఈసారి బాలాపూర్ లడ్డూ కంటే రెండున్నర రెట్లు అధికంగా పలికింది మరో గణపతి లడ్డూ. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గణేశ్ చవితి, గణపతి నిమజ్జనం ఉత్సవాలు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. వినాయక చవితి లేదా గణేశ్ నిమజ్జనం కార్యక్రమమంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ లడ్డూ. అయితే ఈసారి బాలాపూర్ లడ్డూ ధరను దాటేసింది మరో వినాయకుడి లడ్డూ. ఈసారిగా సన్‌సిటీ వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. 


హైదరాబాద్ సన్‌సిటీ ప్రాంతంలోని రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణపతి లడ్డూ వేలం ద్వారా నిధుల సమీకరణ జరిగింది. సన్‌సిటీ ప్రాంతంలోని ఈ లడ్డూ వేలంలో ఏకంగా 60.80 లక్షలు పలికింది. బాలాపూర్ లడ్డూకు ఈసారి వేలంలో పలికిన ధర 24.60 లక్షలు. అంటే బాలాపూర్ లడ్డూ కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ధర పలికింది సన్‌సిటీ రిచ్‌మండ్ విల్లాస్ గణపతి లడ్డూ. 


ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ అనేది రెసిడెన్షియల్ కమ్యూనిటీకు సంబంధించిన ఒక ఛారిటీ గ్రూప్. ఎన్జీవోల రోజువారీ కార్యక్రమాలకు తోడ్పాటులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తుంటుంది. ఏటా జరిగే గణేశ్ ఉత్సవాల్లో లడ్డూ వేలం ఇందుకు ఉపయోగించుకుంటుంది. ఈ ట్రస్టులో ఉండే వాలంటీర్లంతా రిచ్‌మండ్ విల్లాస్ కమ్యూనిటీలో ఉండేవాళ్లే. ఇందులో పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపారులు, అగ్రికల్చరిస్టులు ఇలా విభిన్నరకాలుగా ఉన్నారు. 


బయట్నించి కూడా చాలామంది విరాళాలు ఇస్తుంటారు. ఈ ట్రస్టుకు వాలంటీర్‌గా ఏ డాక్టర్ అయినా సేవలందిస్తూ..ట్రస్టు చేసే కార్యక్రమాలకు తోడ్పాటు అందించవచ్చు. ఈ ట్రస్టుకు డాక్టర్ అర్చనా సిన్హా, మిసెస్ పూర్ణిమా దేశ్‌పాండేలు మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు. 


Also read: Revanth Reddy: మోదీ ఇచ్చిన సుపారీతోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు: రేవంత్‌రెడ్డి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook