Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు..
Hyderabad Traffic Junctions: హైదరాబాద్ : రోడ్లపై ప్రమాదాలు నివారించి, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్‌లను ప్రయోగాత్మకంగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Hyderabad Traffic Junctions: హైదరాబాద్ : రోడ్లపై ప్రమాదాలు నివారించి, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్‌లను ప్రయోగాత్మకంగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇతర మెట్రో సిటీలలోని ట్రాఫిక్ జంక్షన్లకు విభిన్నంగా.. ట్రాఫిక్ వల్ల ప్రమాదాలు అరికట్టే విధంగా, పాదచారులు సురక్షితంగా సులభంగా వెళ్లేందుకు వీలుగా జంక్షన్లను అభివృద్ధి పర్చడం జరుగుతుంది. ప్రస్తుతానికి 12 ట్రాఫిక్ జంక్షన్లలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి వల్ల ఫలితాలు వస్తే యుద్ద ప్రాతిపదికన అన్ని జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జిహెచ్ఎంసి వెల్లడించింది.
[[{"fid":"243667","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hyderabad-Traffic-Junctions-development-works.jpg","field_file_image_title_text[und][0][value]":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. "},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hyderabad-Traffic-Junctions-development-works.jpg","field_file_image_title_text[und][0][value]":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. "}},"link_text":false,"attributes":{"alt":"Hyderabad-Traffic-Junctions-development-works.jpg","title":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. ","class":"media-element file-default","data-delta":"2"}}]]
జీహెచ్ఎంసీ నలుమూలలా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్ఓబిలు, ఆర్.యు.బిలు, పటిష్టమైన రోడ్డు నిర్మాణాలు చేపట్టి వాహనదారులు సకాలంలో గమ్యస్థానానికి చేరే విధంగా కృషి చేయడం జరుగుతోంది. నగరంలో నానాటికి అధికమవుతున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు వాహన క్రమబద్దీకరణ, వాహనాల ప్రమాదాల నివారణకు జంక్షన్ అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరచడం జరిగింది. పాదచారులు ఇరువైపులా రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లకు లిఫ్టులు, కొన్ని చోట్ల ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కూడలిలో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌కి, వెళ్లేందుకు పాదచారుల ప్రయోజనం కోసం సుమారు రూ. 77 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. వీటిలో 7 అందుబాటులోకి రాగ మిగతావి నిర్మాణ దశల్లో ఉన్నాయి.
[[{"fid":"243666","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hyderabad-Traffic-Junctions-development","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్‌మెంట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hyderabad-Traffic-Junctions-development","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్‌మెంట్"}},"link_text":false,"attributes":{"alt":"Hyderabad-Traffic-Junctions-development","title":"హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్‌మెంట్","class":"media-element file-default","data-delta":"1"}}]]
జీహెచ్ఎంసీలో పౌరుల ఇబ్బందులు తొలగించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న పద్దతులను ప్రయత్నిస్తోన్న అధికార యంత్రాంగం.. నగర పౌరుల మౌలిక సదుపాయాలకే పెద్ద పీట వేస్తోంది. జంక్షన్ల అభివృద్ధికి జోన్‌కు 2 చొప్పున 12 జంక్షన్ల ను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపట్టనున్నారు. నగరంలో 12 ప్రదేశాలలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఏదైనా కారణాలతో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచి పోయిన సందర్బాల్లో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా కొన్ని చోట్ల గార్డెనింగ్, కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ లాంటి వసతుల ఏర్పాట్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. స్థలం ఉన్న చోట అట్టి వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కూకట్‌పల్లి జోన్‌లో గుల్‌మోహర్ కాలనీ జంక్షన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
[[{"fid":"243668","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Traffic-Junctions-development-works-in-Hyderabad.jpg","field_file_image_title_text[und][0][value]":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. "},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Traffic-Junctions-development-works-in-Hyderabad.jpg","field_file_image_title_text[und][0][value]":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. "}},"link_text":false,"attributes":{"alt":"Traffic-Junctions-development-works-in-Hyderabad.jpg","title":"Hyderabad Traffic Junctions: హైదరాబాద్‌లో ఇప్పటివరకు జంక్షన్లు వేరు.. ఇకపై జంక్షన్స్ వేరు.. ","class":"media-element file-default","data-delta":"3"}}]]
నగరంలో జీహెచ్ఎంసీ అభివృద్ధి పరిచే జంక్షన్ల వివరాలు
1. ఎల్బీనగర్ జోన్‌లో హబ్సిగూడ, కొత్తపేట్ (ఓల్డ్ సివిల్ కోర్టు హుడా కాంప్లెక్స్)
2. చార్మినార్ జోన్‌లో ఐఎస్ సదన్ ( ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి) ఆరంఘర్ (క్రాస్ రోడ్డు)
3. ఖైరతబాద్ జోన్‌లో సోమాజీగూడ, పంజాగుట్ట (రీ మోడలింగ్ ఆఫ్ ఫుట్‌పాత్ ప్రొవైడింగ్ రైలింగ్, బోల్ లార్డ్)
4. శేరిలింగంపల్లి జోన్‌లో మియాపూర్ X రోడ్డు (రీ మోడలింగ్ ఫుట్‌పాత్, ప్రొవైడింగ్ రైలింగ్, బొల్లార్డ్ ) గుల్ మోహర్ కాలనీ జంక్షన్.
5. కూకట్‌పల్లి జోన్‌లో ఐడిపిఎల్ జంక్షన్ (చింతల్ గాజుల రామారం సర్కిల్( ఫుట్‌పాత్, ఐస్‌లాండ్, పెడెస్టేరియన్ క్రాసింగ్ పబ్లిక్ సిటింగ్ ) కృష్ణకాంత్ జంక్షన్.
6. సికింద్రాబాద్ జోన్‌లో నారాయణ గూడ జంక్షన్ (అంబర్‌పేట్ సర్కిల్ 16) సంగీత్ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు.
ఈ జంక్షన్ల అభివృద్ధి వల్ల ట్రాఫిక్ క్రమ బద్దీకరణ, పాదచారులు భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం వల్ల ప్రమాదాలను అరికట్టడంలో సత్ఫలితాలు సాధిస్తే.. భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ జంక్షన్‌లు ఇదే తరహాలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహచ్ఎంసీ ప్రణాలికలు సిద్ధం చేసుకుంటోంది.
Also Read : TRS VS BJP: రూ 6700 కోట్లు కట్టాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు నెలరోజుల డెడ్ లైన్!
Also Read : CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి