Pressure Horn Challan in Hyderabad: కొంతమంది వాహన దారులు రోడ్డు మీదకు వచ్చారంటే.. అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా హారన్ కొడుతూనే ఉంటారు. దాంతో ట్రాఫిక్‌లో ఉన్నవారు చికాకు పడతారు. అంతేకాదు హారన్ కొట్టడం వల్ల తీవ్ర శబ్ద కాలుష్యానికి కారణం అవుతుంది. ఈ శబ్ద కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త పరిజ్ఞానంను తీసుకొచ్చారు. దాంతో ఇష్టానుసారంగా హారన్లు కొడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వాహనదారులకు చెక్ పెట్టనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోనే తొలిసారిగా అకౌస్టిక్ కెమెరాలను హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. నిర్దేశిత పరిమితికి (80 డెసిబుల్స్‌) మించి ఏ వాహనం హారన్ మోగిస్తోందో ఈ కెమెరాలు గుర్తిస్తాయి. మూడు సెకండ్ల పాటు ఓ వీడియో తీసి కంట్రోల్ రూంకు పంపిస్థాయి. ఆ వెంటనే  సదరు వాహనం నంబరు పేరిట ఓ చాలాన్ జారీ అవుతుంది. నిబంధనలను ఉల్లంగించిన వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. ఎక్కువ చలాన్లు ఉన్న వారిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. 


ఈ టెక్నాలజీని జర్మనీకి చెందిన ఎకోమ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. బుధవారం (ఏప్రిల్ 20) హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై అకౌస్టిక్ కెమెరాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. అంతకుముందు అకౌస్టిక్ కెమెరాల సాంకేతిక, న్యాయపరమైన పరిమితులపైన రంగనాథ్ సమీక్షించారు.


రెండు చేతులతోనూ పట్టుకుని వినియోగించే అకౌస్టిక్ కెమెరా ముందు వైపు మానిటర్, వెనుక వైపు 72 మైక్రోఫోన్లు ఉంటాయి. వీటి సహాయంతో అకౌస్టిక్ కెమెరా గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల శబ్ధ కాలుష్యాన్ని గుర్తిస్తుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్‌ నుంచి గరిష్టంగా 20 వేల డెసిబుల్స్‌ వరకు శబ్ధాలను గుర్తించి.. సదరు వాహనంను వీడియో, ఫొటో తీస్తుంది.  ఈ కెమెరా ఖరీదు దాదాపుగా రూ.13 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. 


Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం.. నగర వాసులకు ఉపశమనం!


Also Read: Mask Fine Hyderabad: తెలంగాణలో మాస్క్ ధరించపోతే రూ.1,000 జరిమానా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.