Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం ఇవాళ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటింది. ఈ క్రమంలో తీర ప్రాంతంలో సముద్రంలో కెరటాల అలజడి ఎక్కువగా కన్పించింది. అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాయుగుండం తీరం దాటి అల్పపీడనంగా బలహీనపడుతోంది. దాంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రానున్న 4-5 గంటల్లో భారీ వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, కామారెడ్డి, మల్కాజ్‌గిరి, మెదక్, సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 


ఇప్పటికే నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేర్‌లింగంపల్లి, నిజాంపేట్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, ఖైరతాబాద్, పంజూగుట్ట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, చాదర్ ఘాట్, కోఠి, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉప్పల్, రామంతపూర్, అంబర్ పేట్, సికింద్రాబాద్, నాంపల్లి, ఆబిడ్స్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరుకుని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుుడు మరోసారి రానున్న 4-5 గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన జారీ అయింది. 


Also read: KTR Group 1 Aspirants: అర్ధరాత్రి గ్రూప్‌ 1 అభ్యర్థుల మొర.. వస్తున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి