హైదరాబాద్ లో మెట్రో రైలు మంగళవారం పట్టాలెక్కబోతోంది. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గోనేందుకు వస్తున్న ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 2:15కి మెట్రో రైలు ప్రారంభిస్తున్నారు. మొత్తం 30 కి.మీ మేర మొదటి దశ మెట్రో రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం  మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు..మరల  కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు మెట్రో  రైల్లో ప్రధాని మోడీ ప్రయాణిస్తారు. ప్రయాణీకులకు ఈ బుధవారం నుంచి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.


 మొత్తం రూ.15 వేల కోట్ల వ్యయంతో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. మొదటి దశలో మియాపూర్ అమీర్ పేట రూట్ లో 13 కి.మీ. అమీర్ పేట- నాగోల్ రూట్ లో 17 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. తొలి దశలో భాగంగా ఈ రూట్ లో  30 కి.మీ మేర మెట్రో రైళ్లను నడుతున్నారు.