తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత
తప్పిపోయిన బాలిక జాడ తెలుసుకొన్న హైదరాబాద్ పోలీసులు పాప తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్: తప్పిపోయిన బాలిక జాడ తెలుసుకొన్న హైదరాబాద్ పోలీసులు ఆమెను తన తల్లిదండ్రులకు అప్పగించారు. గత కొన్ని రోజుల క్రితం తమ పాప తప్పిపోయిందని ఆయా బాలిక తల్లిదండ్రులు ఆసిఫ్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు..బాలిక కోసం విస్తృతంగా గాలించారు. ఎట్టకేలకు పాప జాడ తెలుసుకున్నారు. చిన్నారిని మెహదీపట్నంలోని అంబా థియేటర్ దగ్గర గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఆ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సకాలంలో పాప జాడ కనుకొన్న ఆసిఫ్ నగర్ పోలీసుల పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది.