HYDRA: మూసీ వైపు బుల్‌డోజర్లు.. 1350 ఇండ్లకు నోటీసులు..
HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తుంది. అయితే.. ఈ దూకుడు చెరువులు కుంటలు ఆక్రమించుకున్న బడా బాబులపై కాకుండా మిడిల్ క్లాస్ వాళ్లపై దూకుడు ప్రదర్శించడం వివాదాలకు తావు ఇస్తుంది. తాజాగా హైడ్రా బుల్‌డోజర్లు ఇపుడు మూసీ వైపు అడుగులు వేస్తుంది.
HYDRA: మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ లో మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా.. మూసి నివాసితుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు చేసింది. నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసి నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసి ఆక్రమణల వివరాల సేకరణను ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లో కూల్చివేతలు ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసి ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. అయితే.. హైడ్రా కూల్చివేతలపై ముందుగా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. రాను రాను ఈ కూల్చివేతలతో మిడిల్ క్లాస్, ఎగువ మధ్య తరగతి వారే అన్యాయంగా బలైవుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
ముందుగా నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి చెరువులు కుంటల్లో నిర్మించిన ఆక్రమణలు తెలిగించరానే అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రాను రాను హైదరాబాద్ వాసులు తన పార్టీ ఓటు వేయలేదనే కక్షతోనే హైడ్రాతో హై డ్రామాలు ఆడుతున్నాడనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో అక్రమంగా మీరాలం చెరువు, బాలాపూర్ చెరువు ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ వాళ్లు అక్రమంగా ఆక్రమించుకున్న భూములపై కొరడా ఝళిపించాలన్నారు.
మరోవైపు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ప్రసాద్ ఐమాక్స్ తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సెక్రటేరియట్, జల విహార్ వంటివి ఉన్నాయి. వాటిని కూల్చే దమ్ము రేవంత్ కు ఉందా అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్యమంత్రికి సవాల్ విసుతున్నారు. హైడ్రా పేరుతో అమాయకుల ఆస్తులను కూల్చడం తగదన్నారు. మొత్తంగా పాతబస్తీ లో చెరువుల చెరను ముందుగా విడిపించాలన్నారు. మరోవైపు మాసాబ్ టాంక్ ప్రాంతంలో చెరువు ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం గ్రౌండ్ ఉందన్నారు. మొత్తంగా హైడ్రా వ్యవహారం ముదిరి పాకానా పడుతుంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.