Hydra: కూల్చివేతలు కాదు.. దీని వెనుక మా టార్గెట్ అదే.. అసలు నిజం బైటపెట్టిన హైడ్రా రంగనాథ్..
Hydra demolishes: కొంత మంది సోషల్ మీడియాలో కావాలని హైడ్రాను ఒక బూచిలాగా చూపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంతే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూల్చివేతలు జరిగిన హైడ్రాపనే అంటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు
Hydra ranganath clarity on illegal demolishes in Hyderabad: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా పేరు హల్ చల్ గా మారింది. ముఖ్యంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్పెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని సైతం కేటాయించారు.
ఇదిలా ఉండగా.. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పెద్ద ఎత్తున పలు ప్రాంతాలలో నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పటికే కొంత మంది హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సైతం, హైడ్రా చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. శని,ఆదివారాల్లో కూల్చడమేంటని, మీ చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగానే స్పందించింది.
ఈ క్రమంలో తాజాగా, హైడ్రా ఏర్పాటు, దాని టార్గెట్ పై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా హైడ్రా టార్గెట్ కూల్చివేతలు కాదని, చెరువుల పునరుద్దరణ హైడ్రా లక్ష్యమని రంగనాథ్ అన్నారు. అదే విధంగా.. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని క్లారిటీ ఇచ్చారు. మెయిన్ గా.. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మోద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.
కొంత మంది.. రాష్ట్రంలోనే కాదు.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా.. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం హైడ్రా ప్రధాన కర్తవ్యమన్నారు. అదే విధంగా.. వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలుతీసుకుంటుందన్నారు. వరద నీరు సాఫీగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇలా నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు.
మూసీ పనుల్లో హైడ్రా లేదు..
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడంలేదని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని, మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడంలేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని, దీనిని మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా చర్యలు..
అదే విధంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా చర్యలు చేపడుతుందన్నారు. ట్రాఫిక్ పలు సమస్యలపై హైడ్రా అధ్యయనం చేస్తుందన్నారు. ప్రయాణికులు ఇబ్బందులు కల్గకుండా..హైడ్రా, పోలీసులు సమన్వయంతో పనిచేస్తారన్నారు.
ప్రకృతి వైపరీత్యాలపై హైడ్రా దృష్టి..
వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరిస్తూ డీఆర్ ఎఫ్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్)ను రంగంలోకి దించుతామన్నారు. ఎక్కడైన చెట్లు నేల కూలితే వెంటనే వాటిని తొలగించడం, రహదారులు, నివాసాల్లోకి వచ్చి చేరిన వరద నీటిని మళ్లించడం లేదా తొలగించడం. వరద ముప్పు లేకుండా వరద నీటి కాలువలు సాఫీగా పారేలా చూడడం కూడా హైడ్రా నిర్వహిస్తుందన్నారు. డిజాస్టర్ టీమ్ తో.. నష్ట నివారణ చర్యలు, ప్రజలకు రక్షణ కల్పించడం.
ప్రకృతి వనరులు కాపాడడంలో హైడ్రా ..
నగరం ఒకప్పడు లేక్ సిటీగా పేరుండేది. గొలుసుకట్టు చెరువులు సాగు, తాగు నీరందించేవన్నారు. కానీ ఇప్పుడు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. మెయిన్ గా నగరంలో చెరువులను పునరుద్ధరించి, వరద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడికక్కడ చేరేలా చూడడం తమ ప్రథమకర్తవ్యమన్నారు.
Read more: High court: శని, ఆదివారం కూల్చివేతలేంటీ..?. హైడ్రాకు చుక్కలు చూపించిన తెలంగాణ హైకోర్టు.. ఏమందంటే..?
రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్, స్టేట్ రిమోట్ సెన్సింగ్ విభాగాలతో అధ్యయనం చేయించి.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.