HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలు
HYDRAA Demolished Houses At Aminpur Kukatpally Victims Tears Up: హైదరాబాద్‌ను హైడ్రా కూల్చివేతలు కన్నీటిని తెప్పిస్తోంది. ఆదివారం పూట హైడ్రా కూల్చివేయడంతో ఎక్కడా చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయి.
HYDRAA Demolish Tragic: వారాంతం రోజుల్లోనే హైడ్రా రెచ్చిపోతోంది. పని రోజుల్లో ప్రశాంతంగా ఉంటూ ఒక్క ఆదివారం రోజే హైడ్రా బుల్డోజర్లపతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ ఆదివారం కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో హైడ్రా దాడులు చేపట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. అయితే అకస్మాత్తుగా బుల్డోజర్లతో రావడంతో నివాసితులు లబోదిబోమన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో కన్నీళ్లు.. రోదనలతో ఆ ప్రాంతం ఉద్విగ్న వాతావరణంతో నిండిపోయింది.
Also Read: Cyber Crime: రీల్స్‌కు లైక్ కొడితే డబ్బే డబ్బు.. లక్షల్లో మోసపోయిన బాధితులు
అమీన్‌పూర్‌లో
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 12లో ఆదివారం ఉదయమే హైడ్రా రంగంలోకి దిగింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పటేల్‌గూడ గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 6 పేరుతో.. కిష్టారెడ్డిపేట గ్రామం ప్రభుత్వ సర్వే నంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేసింది.
Also Read: Arya Vysyas: పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై దుమారం.. మరో అగ్గి రాజేసిన రేవంత్ సర్కార్
కూకట్‌పల్లిలో..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూడా ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎటువంటి నోటీసు లేకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా కూల్చివేతలు కొనసాగించింది.
రోదనలు.. కన్నీళ్లు
నల్లచెరువులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కోల్పోయిన వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని కూడా కూల్చివేయడంతో వారు మండిపడుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి వ్యాపారం చేస్తుంటే హైడ్రా పేరిట అధికారులు కూల్చివేతలు చేయడం సరికాదని వాపోయారు. తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల కాళ్లకు దండం
ఇల్లు కోల్పోయిన మహిళలు, బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ గూడు కూల్చేయడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కూల్చివేతలకు వచ్చిన హైడ్రా అధికారులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కాళ్లు పట్టుకుని కూల్చవద్దని కోరుతుండడం అందరినీ కలచివేస్తోంది. సామాన్యులు.. పేదలపైనే హైడ్రా ప్రతాపం అని.. రేవంత్ రెడ్డి తమ్ముడు.. మురళీమోహన్ వంటి వారికి మాత్రం నోటీసులు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా హైడ్రా తెలివిగా ఆదివారం రోజునే కూల్చివేతలు చేపడుతుండడంతో కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోతున్నది. దీంతో స్థానికులు హైడ్రాపై.. రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter