Jawahar Nagar Murder Mystery: హైదరాబాద్ లో సంచలనం రేపిన జవహర్ నగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడి తో కలిసి భర్త స్వామిని హత్య చేసినట్లు పోలీసులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే.. బాలాజీనగర్ లోని స్వామి, కావ్య లు భార్యభర్తలు. ఈ క్రమంలో అక్కడ ఎదురింట్లోనే ప్రణయ్ అనే వ్యక్తి కూడా ఉండేవాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భర్త పనిమీద వెళ్లగానే ఇద్దరు ఇంట్లోనే దుకాణం తెరిచేవారు. భర్తకు తెలియకుండా సీక్రెట్ గా కలుసుకునేవారు. భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రవర్తన మార్చుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించాడు.  దీంతో ఎలాగైన భర్త అడ్డు తొలగించుకోవాలని కావ్య ప్లాన్ వేసింది. దీనిలో భాగంగా.. స్వామిని ఈ నెల 26 న  తన క్యాబ్ లో ఎక్కించుకుని నిజామాబాద్ కు  ప్రణయ్ తీసుకువెళ్లాడు.


వివాహేతర సంబంధం విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.  ఈక్రమంలో కోపంతో.. అప్పటికే సిద్దంగా పెట్టుకున్న  కత్తితో స్వామిని పొడిచి ప్రణయ్ హతమార్చారు. ఆ తర్వాత స్వామి మృతదేహాన్ని కౌకూర్ లోని అటవీ ప్రాంతంలో పడేసి తగలబెట్టేశారు. ప్రణయ్ కి సహకరించిన  రోహిత్, నగేష్ అనే ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. 


ప్రియుడు ప్రవీణ్ కి కావ్య..  తన 6 తులాల బంగారు నగలు అమ్మి డబ్బులు ఇచ్చింది. అంతే కాకుండా.. మరోసారి లోన్ యాప్ ద్వారా 3 లక్షలు తీసుకుని కావ్య తన ప్రియుడు ప్రణయ్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డ వీరిద్దరు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరి ఫోన్ డాటా పరిశీలించగా అనేక మెసెజ్ లు, ఫోన్ కాల్స్ పై పోలీసులు ఆరాతీయగా ఈ మిస్టరీ అంతా బైటపడింది. 


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook