Graduate MLC Election: డిగ్రీ చదువుకున్నారు. బాధ్యతాయుతమైన ఓటు వేయాలి. కానీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి అమూల్యమైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకున్నారు. చదువుకున్న నిరక్షరాస్యులుగా మారారు. విలువైన ఓటు పత్రంపై ఐ లవ్యూ.. జై మల్లన్న.. జై రాకేశ్‌ రెడ్డి.. ఫోన్‌ పే నంబర్లు వంటి పిచ్చి పిచ్చి రాతలతో ఓటు వేశారు. కానీ నిర్వీర్యం చేసుకున్నారు. ఇదంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం


వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికవడంతో తన పట్టభద్ర ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీ పడుతున్నారు.

Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం


 


బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం నల్లగొండలోని దుప్పలపల్లి  వేర్ హోసింగ్ గోదాములో ప్రారంభం కాగా గురువారం కూడా కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు భారీగా ఉన్నాయి. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండడంతో అత్యంత ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల గెలుపోటములను చెల్లని ఓట్లు తారుమారు చేస్తోంది.


పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఓటు వేస్తారు. ఈ ఓటు అత్యంత జాగ్రత్తతో వేయాల్సి ఉంది. ఏమాత్రం తప్పులు చేసిన ఓట్లు నిర్వీర్యం అవుతున్నాయి. పట్టభద్ర ఓటర్లు తెలిసో తెలియక చాలా తప్పులు చేశారు. మూడు రౌండ్‌లు ముగిసేసరికి 20 వేలకు పైగా చెల్లని ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు ఆరోస్థానంలో ఉన్నాయి. చెల్లని ఓట్లలో పట్టభద్రులు చిత్రవిచిత్ర వేషాలు వేశారు. బ్యాలెట్ పేపర్‌లో జై మల్లన్న, జై రాకేష్ రెడ్డి అంటూ కొందరు రాతలు రాశారు. అంతేకాకుండ అభ్యర్థులను ప్రశంసిస్తూ నంబర్‌ వేయకుండా ఐలవ్ యూ అని మరికొందరు రాశారు. ఇంకొందరు ఫోన్ పే నంబర్ రాశారు. 


ఖాళీ బ్యాలెట్ పేపర్‌పైన సాధారణంగా ఎలాంటి రాతలు రాయకూడదు. అభ్యర్థుల ముందు నంబర్లు మాత్రమే వేయాల్సి ఉంది. పట్టభద్రులు చేసిన తప్పిదాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న వాళ్లు తమ ఓటును కూడా సక్రమంగా వేయలేరా? అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చదువుకున్న నిరుద్యోగులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఘ కొనసాగుతుండగా తీన్మార్‌ మల్లన్నపై బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి విజయం సాధించారు. అయితే అభ్యర్ధుల అతి ప్రవర్తన, అవగాహన లోపం కారణంగా ఓటు వేయడంతో అవి చెల్లుబాటు కావడం లేదు. 


పోలింగ్‌ శాతం..
పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శాతం 72.44 నమోదైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు 4 హాల్స్‌లో ఒక టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 96 టేబుల్స్‌పై 96 వేల ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. మొత్తం నాలుగు రౌండ్స్‌లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒక్కో షిఫ్ట్‌లో  900 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఈ ఓట్లు లెక్కించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. మొదటి ప్రాధాన్యం ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇది కనుక జరిగి రేపు రాత్రికి ఫలితం వెలువడే అవకాశం ఉంది.


మొత్తం పోలైన ఓట్లు 3,36,013
పోస్టల్ బ్యాలెట్స్ : 2,139



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter