నా గురించి ఇంకోసారి మాట్లాడితే.. చెప్పుతో కొడతా! ఎంపీ అరవింద్‌కి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
TRS MLC Kavitha warns to MP Dharmapuri Aravind. ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం చేశారు. నిజమాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా అని వార్నింగ్ ఇచ్చారు.
TRS MLC Kavitha to Warns MP Dharmapuri Aravind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం చేశారు. ఒక అడబిడ్డగా కొన్ని మాటలను వినలేకపోయానని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే నిజమాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా అని వార్నింగ్ ఇచ్చారు. ధర్మపురి అరవింద్ ఎక్కడ నిలబడ్డా.. అక్కడి నుంచి పోటీ చేసి ఆయనను ఒడిస్తా అని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మల్లికార్జున ఖర్గేతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారని ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆమె పై విధంగా స్పందించారు.
శుక్రవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ... 'బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ యాక్సిడెంటల్‌గా గెలిచారు. అరవింద్ చిల్లర చిల్లరగా మాట్లాడతాడు. నిజామాబాద్ పేరును ఆయన చెడగొడుతున్నాడు. బురదలో రాయి వేయకూడదనే.. ఇన్నాళ్లు అరవింద్‌ను ఏమనకుండా ఉన్నాను. నా గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. అరవింద్.. రాజకీయం చేయి కానీ పిచ్చి వేషాలు వేయకు. పార్టీ మారుతానని అడ్డమైన కూతలు కూస్తే.. నిజామాబాద్ చౌరస్తాలో నిలబెట్టి చెప్పుతో కొడతాను' అని అన్నారు.
'నేను ఆవేదన, బాధతో మాట్లాడుతున్నా. ఇంకోసారి గీత దాటితే కొట్టికొట్టి చంపుతా. రాజకీయాల్లో ఉంటే.. నీతి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం కాస్త ఉండాలి. ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడి సమయం వృథా చేసినందుకు మీడియాకు క్షమాపణలు. నేను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతానని అన్నానా?. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా.. వెంటాడి మరి ఓడిస్తాను. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు' అంటూ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
'తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అనరాని మాటలు అంటున్నారు. ఒక అడబిడ్డగా కొన్ని మాటలను వినలేకపోయా. పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్ చేసింది ఏమీ లేదు. బీజేపీలో చేరమని నాకు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. నాకు చాలా ఆశలు చూపించారు. అయినా నేను వాటిని సున్నితంగా తిరస్కరించారు. పెద్దల నుంచి వచ్చిన ప్రతిపాదనను కూడా మర్యాదకపూర్వకంగా తిరస్కరించాను. ప్రజలను, నాయకులను మోసం చేయబోమని వారికి చెప్పాను. నాకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. ఎలాంటి కేసులను అయినా నేను ఎదుర్కొంటా' అని ఎమ్మెల్సీ కవిత స్పషం చేశారు.
Also Read: Ananya Panday Hot Photos: హద్దు దాటేసి అందాలు ఆరబోస్తున్న అనన్య..నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్ అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.