KT Rama Rao: అకస్మాత్తుగా బుల్డోజర్లతో వచ్చి పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రాపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా భాదితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. తాను బుల్డోజర్లకు అడ్డంగా ఉంటానని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్‌ హయాంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించినట్లు తెలిపారు. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: మంత్రివర్యా కోమటిరెడ్డి నీ వీడియో చూపిస్తా.. ఒకసారి చూస్కో


'కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఎన్‌ కన్వెన్షన్‌కు అనుమతి కాంగ్రెస్‌ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, బుద్ద భవన్ నాలాలపైనే ఉన్నాయి. మంత్రుల ఇండ్లు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో ఉన్నాయి. ముందు వీటిని కూల్చండి' అని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. నగర ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి  వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరని పేర్కొన్నారు.


Also Read: TTD Temple: దెబ్బకు ప్రధాని మోదీ దిగిరావాలి.. తిరుమల లడ్డూపై హనుమంతరావు తాత దీక్ష


హైదరాబాద్‌లో తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్టీపీలను కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరుల బృందం పర్యటించింది. కూకట్‌పల్లిలోని ఫతేనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టీపీని పరిశీలించారు. 'హైదరాబాద్‌ను మురుగు నీటి రహిత నగరంగా మార్చేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించింది. రూ.3,866 కోట్లతో భారీ ఎత్తున మురిగినీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాం. ఎస్‌టీపీల నిర్మాణం పూర్తయితే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ గణత సాధిస్తుంది' అని కేటీఆర్‌ తెలిపారు.


'కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గింది. హైదరాబాద్ ప్రజలను మురికినీటికి దూరం చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇచ్చి వెంటనే పూర్తిచేసేలా ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ చేసిన గొప్ప కార్యక్రమం ఎస్టీపీల నిర్మాణం' అని కేటీఆర్‌ వివరించారు. మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 'మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది' అని ఆరోపించారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందన్నారు. 'మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.