Smita Sabharwal Interview with Zee Telugu: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మంత్రి సీతక్కతో సమావేశం సందర్భంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరోవైపు ఆమె రాజకీయాల్లోకి వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె ఏ పార్టీ నుంచి బరిలో నిలవనున్నారు..? సీతక్క ఎదురుగా కాలు మీద కాలు వేసుకోవడంపై ఏం అంటున్నారు..? జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో స్మితా సబర్వాల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఒకే అంటెప్ట్‌లో సివిల్స్ కంప్లీట్ చేశానని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఆన్‌లైన్‌ అప్‌డేట్


తనకు ఈ పోస్టింగ్.. ఆ పోస్టింగ్ అని పిచ్చి ఉండదన్నారు స్మిత. సీతక్క దగ్గర కాలు మీద కాలు వేసుకుని కూర్చొవడంపై ప్రశ్నించగా.. తాను ఇప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నానని.. అది తన స్టైల్ అని చెప్పారు. తనది మొదట లవ్ కాదని.. తన పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తాను ఆలిండియా సివిల్స్ టాపర్‌గా వచ్చానని.. ఆరో తరగతిలో తెలుగు ఫెయిల్.. ఐఏఎస్ టాపర్ అని న్యూస్‌లో హెడ్డింగ్ పెట్టారని గుర్తు చేసుకున్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కన్నీళ్లు పెట్టుకోవడం గురించి స్పందిస్తూ.. ఎవరు కావాలని ఏడ్వరని అది కూడా కలెక్టర్ ఏడుస్తారా..? అని అన్నారు. ఆ రోజు  తాను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. కలెక్టర్ అంటే స్మితా సబర్వాల్ అని అనగా.. డైరెక్ట్‌ కనెక్ట్ విత్ పబ్లిక్ అని చెప్పారు.       


కరీంనగర్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయని స్మిత తెలిపారు. మెదక్ జిల్లాతో విడదీయలేదని అనుబంధం ఉందన్నారు. మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు. హెలికాఫ్టర్ ఉపయోగించి మోస్ట్ పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా చక్రం తిప్పారని ప్రశ్నించగా.. హెలికాఫ్టర్ వాడితే మోస్ట్ పవర్‌ఫుల్ అవుతారని ప్రశ్నించారు. ఐఏఎస్‌గా కంటిన్యూ అవుతారా..? పాలిటిక్స్‌లోకి వస్తారా..? అని ప్రశ్నించగా.. భవిష్యత్‌ను ఊహించలేమంటూ సమాధానం దాటవేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లబోనని చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను రిటైరయ్యాక పాలిటిక్స్‌ విషయం ఆలోచిస్తానంటూ హింట్ ఇచ్చారు.


 



జీ తెలుగుకు స్మితా సబర్వాల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. CMO ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ.. హెలికాప్టర్‌లో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. కేంద్ర సర్వీసులకు వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. స్మితను తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. 
జీ తెలుగు న్యూస్‌తో ఆమె చాలా విషయాలు పంచుకున్నారు. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని.. నిబద్దతతో పని చేసుకుంటూ వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. పూర్తి ఇంటర్వ్యూ అతి త్వరలోనే రానుంది. 


Also Read: CAA Implement: 'మోదీ అమలుచేస్తే మేం చేయాల్నా? మోదీ గాడ్సే నిర్ణయం': కేంద్రానికి ప్రతిపక్షాల ఆల్టిమేటం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter