Telangana: తెలంగాణలో వచ్చే 5 రోజులు ఆరెంజ్ అలర్ట్, పొరపాటున కూడా బయటకు రావద్దు
Telangana: ఎండాకాలం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వేసవి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వడగాల్పులు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana: తెలంగాణలో రానున్న 5 రోజులు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది.
తెలంగాణలో వేసవి పీక్స్‌కు చేరుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. రానున్న 5-6 రోజులు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాలో వడగాల్పులు వీయనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట్, గద్వాల్ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రతపై ఆరెంజ్ ఎలర్ట్ జారీ అయింది.
ఈ నెల 30 తేదీ జగిత్యా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా ఈ ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Also read: Supreme Court: బ్యాలెట్ పేపర్ సాధ్యం కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ పూర్తిగా అవాస్తవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook