Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రములోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసింది. బుధ, గురువారం తేలికాపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే ఛాన్స్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర ఒరిస్సా దానిని అనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్ అండ్ గాంగ్ టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఇవాళ  మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా పయనిస్తోంది. మరో ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సముద్ర మట్టo నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతు ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపు ప్రయాణిస్తోంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.  కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.


ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ గద్వాల, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, నిర్మల్ , నిజామాబాద్ జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో 10 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద మొదలైంది. ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో మేడిగట్ట ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగవకు వదులుతున్నారు.


Read also: Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి


Read also:  Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ..    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook