Heavy rainfall in Telangana: తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా మీదుగా తెలంగాణ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగానే నేడు భారీ వర్షాలు (Heavy rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన నివేదిక (Weather report) ప్రకారం నిన్న బుధవారం కూడా రాష్ట్రం నలుమూలలా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 


Also read : Minister KTR's defamation suit: మంత్రి కేటీఆర్‌ పిటిషన్.. Revanth Reddy కి కోర్టు నోటీసులు


నల్గొండ జిల్లా దోమలపల్లిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం (Heavy rainfall) నమోదు కాగా ఖమ్మం జిల్లా రావినూతలలో అత్యల్పంగా 4.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గత నెల రోజులకుపైగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా.. అనేకచోట్ల వాగులువంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.


Also read : Heavy Rains Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook