IMD predicts Heavy rains in Telangana: రుతు పవనాల రాకకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనూ నిత్యం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం (Hyderabad rains) కురుస్తోంది. దీనికితోడు రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు (GHMC) నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిషా ప్రాంతంలో అల్పపీడనం (Low pressure in bay of bengal) స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి తోడు అనుబంధంగా వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం మరో రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.