Telangana Weather Report: తెలంగాణకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Telangana Rains: ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నేడు, రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో భారీగా మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ,వాతావరణ హెచ్చరికల వివరాలను వెల్లడించింది. నిన్న ఏర్పడిన ద్రోణి/గాలి విచ్చిన్నతి ఈరోజు ఆగ్నేయ రాజస్థాన్ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్ మీదుగా కోస్తా కర్ణాటక ఉత్తర ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Also Read: Maharashtra: ఘోర విషాదం.. పిల్లిని రక్షించబోయి ఐదుగురు మృతి
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది భానుడు ఉగ్రరూపం దాల్చడంతో మార్చి, ఏప్రిల్ నెలల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగిపోవడంతో ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. గత రెండు రోజులుగా కాస్త పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు తగ్గముఖం పట్టడంతో ఎండ తీవ్రత తగ్గింది. రాత్రి వేళ చల్లటి గాలులు వీస్తుండడంతో వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వర్ష సూచనతో పలువురు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటకు నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. మరోవైపు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుందన్నారు.
Also Read: Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook