Rains in Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాలకు రాబోయే రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావం తెలంగాణపై (Telangana Weather) ఉండనున్నట్లు తెలిపింది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో (జనవరి 23, 24) ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం (జనవరి 22) రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, వచ్చే మంగళ, బుధ (జనవరి 25, 26) తేదీల్లోనూ వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది.


రాష్ట్రంలోని (Telangana) పలు ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల చలి తీవ్రత పెరుగుతోంది. నిర్మల్ జిల్లా తానూర్‌లో శుక్రవారం (జనవరి 21) 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో మిగతా జిల్లాలతో పోలిస్తే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో 20 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 



Also Read: Priyanka Chopra - Nick Jonas: షాకింగ్ న్యూస్.. తల్లైన స్టార్ హీరోయిన్! అంతా సీక్రెట్‌గానే!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook