Telangana Weather Report: తెలంగాణకు వర్ష సూచన.. రాగల మూడు రోజుల్లో..!
Rain threat for Telangana State. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం జారీ చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం (ఏప్రిల్ 4) ఉదయం జారీ చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.
ఆదివారం ఉపరితల ద్రోణి మహారాష్ట్రలోని మరట్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు కొనసాగింది. ఈరోజు మరట్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు కొనసాగింది. సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దాంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
మంగళవారం (ఏప్రిల్ 5) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం 08:30 గంటల సమయంలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా హైదరాబాద్ వాతావరణ అధికారులు ఈ విషయాన్ని చెప్పారు.
మరోవైపు ఈసారి ఎండలు గత సంవత్సరం కంటే తొందరగా మొదలయ్యాయి. మార్చి మధ్య నుంచే తెలంగాణాలో రోజురోజుకీ భానుడు భగభగమన్నాడు. ఎండ తీవ్రతకు రోడ్ల మీద జనాలు కనిపించడం తగ్గిపోయింది. అయితే గత వారం రోజులుగా తన ప్రతాపాన్ని చూపిన బాణుడు.. నిన్న మాత్రం కాస్త కనికరించాడు. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భానుడి ప్రతాపం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Taapsee Pannu: సినిమాల్లోనే చాలా డ్రామా ఉంది.. వ్యక్తిగత లైఫ్‌లో అవసరం లేదు: స్టార్ హీరోయిన్
Also Read: Prabhas Maruti Movie: హారర్ నేపథ్యంలో ప్రభాస్, మారుతి చిత్రం.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook