HYDERABAD RED ALERT: తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్ఠి కురుస్తోంది. రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్డ్ జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది ఐఎండీ. దీంతో నగర అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు, వరదలపై సమీక్షించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ కు వాతవరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిందన్న సీపీ.. జనాలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపైకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎవరికి ఏ  ఇబ్బంది వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు పగలు, రాత్రి అందుబాటులో ఉంటారని చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ శివారులో ఉన్న హిమాయత్ సాగర్ డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేస్తున్నారు. నిజానికి గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ లోకి వరద నీరు చేరలేదు. డ్యాం క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురవలేదు. కాని గత ఏడాది వచ్చిన వరదతో హిమాయత్ సాగర్ నిండుగానే ఉంది. ప్రస్తుతం డ్యాం కేపాసిటీలో 60 శాతానికి పైగా నీళ్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ కు రెడ్ అలెర్డ్ జారీ కావడం, మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి, సోమవారం హిమయత్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వరద ఒకేసారి వస్తే దిగువకు వదలడం కష్టమవుతుంది. అందుకే ముందే రిజర్వాయర్ ను ఖాళీ చేసేందుకు గేట్లు ఎత్తాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లోనూ నీళ్లు భారీగానే ఉన్నాయి. ఆ డ్యాం గేట్లు కూడా ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 


Read also: Pawan Kalyan: అధికార మదంతో అలా చేస్తే తాటా తీస్తా..వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక..!


Read also:  South Africa Mass Shooting: సౌతాఫ్రికాలోని ఓ బార్‌లో దుండగుల కాల్పులు... 14 మంది మృతి...  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook