Telangana Rain Alert: కుండపోత వానలతో తెలంగాణకు వరద గండం.. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది.మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిస్తున్నాయి.
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది. మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి, మంచిర్యాల, అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం., మహబూబా బాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో అత్యధికంగా 102 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో 100 మిల్లిమీటర్లు, మహబూబా బాద్ జిల్లా తొర్రూరులో 94, పెద్దపల్లి జిల్లా అక్కన్ పల్లిలో 93, మంచిర్యాల జిల్లా హాజిపూర్ లో 89, ఖమ్మం జిల్లా తల్లాడలో 86, భద్రాద్రి జిల్లా మందపల్లిలో 84, సూర్యాపేట జిల్లా నాగారంలో 83 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఈనెల 9వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం నిజామాబాద్ , పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల , కరీంనగర్ , హన్మకొండ , వరంగల్ , మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి , మల్కాజ్ గిరి, రంగారెడ్డి , నల్గొండ , హైదరాబాద్ , యాదాద్రి, ఖమ్మం . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హై అలెర్ట్ జారీ చేసింది. [[{"fid":"240589","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇటీవల వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు రాష్టమంతా వరద పోటెత్తింది. వందలాది గ్రామాలు జలమయం అయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్ని ప్రస్తుతం నిండుకుండలా ఉన్నాయి. వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్ని ఫుల్లుగా ఉండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. అల్పపీడనంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook