Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగింపు

Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది
Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. అయితే విద్యాసంస్థలకు సెలవులు మరో మూడు రోజులు పొడిగించింది ప్రభుత్వం. సోమవారం నుంచి స్కూళ్లు పున ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ బాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏడు రోజులుగా కురుస్తున్న వర్ఘాలతో తెలంగాణలో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమలయ్యాయి. పలు ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద బీభత్సం దారుణంగా ఉంది. ఇంకా వర్షాలు వస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో విద్యాసంస్థలను నడపడం సరికాదని విద్యాశాఖ అధికారులు భావించారు. ఐఎండీ వర్ష హెచ్చరికతో గురువారం, శుక్రవారం జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.
Read also: Supermoon: వినీలాకాశంలో అరుదైన అద్భుతం.. భూమికి దగ్గరగా కనువిందు చేయనున్న సూపర్ మూన్
Read also: తులసికి నీరు పోసేటప్పుడు ఈ మంత్రం చెప్తే... మీ సంపద వెయ్యి రెట్లు పెరుగుతుంది
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook