Nagarjuna Sagar Dam: రెండేళ్ల తర్వాత అద్భుతం.. నాగార్జున సాగర్ ఆరు క్రస్ట్ గేట్ల ఎత్తివేత.. వీడియో వైరల్..
Nagarjuna sagar reservoir: నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరుపొటెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆరుగేట్లను ఓపెన్ తెరిచి వరదనీటిని కిందకి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Irrigation officers opens Nagarjuna sagar 6 gates: కొన్నిరోజులుగా రుతుపవనాలు దేశమంతట జోరుగా విస్తరించాయి. దీంతో అనేక రాష్ట్రాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తరాదిన అనేక చోట్ల కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో దిగువకు గేట్లు ఓపెన్ చేశారు. దీంతో భారీగా నీళ్లు ప్రస్తుతం నాగార్జున సాగర్ కు వచ్చి చేరింది. ఈ క్రమంలో శ్రీశైలం మాదిరిగా, నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది.
దీంతో అధికారుల దిగువకు నీళ్లను వదులుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఆరుగేట్లను ఓపెన్ చేసి దిగువకు నీళ్లను వదిలారు. ఇదిలా ఉండగా.. రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ ఎత్తడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గతంలో 2022లో ఆగస్టు 11న చివరిసారిగా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో తాజాగా, ఆరుగేట్లు ఓపెన్ చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు ఉరకలేస్తుందని చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా అధికారులు నిన్నటి నుంచి నాగార్జున సాగర్ లోకి భారీగా వరద నీరు పొటెత్తుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అందరు భావించిన విధంగానే ఈరోజు అధికారులు ఆరు క్రస్ట్ గేట్లు ఓపెన్ చేశారు. ముందుగా అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేయకముందే డ్యామ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా.. మూడు సార్లు సైరన్ మోగించి, డ్యామ్ కు సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులకు కూడా అధికారులు కీలక ఆదేశాలు జారీచేశారు.
ఎవరు కూడా చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు. నీటిని విడుదల చేసే ముందు ఎస్ఈ నాగేశ్వర రావు, సీఈ అనిల్ కుమార్ జలహరతి ఇచ్చారు.ఆ తర్వాత ఒక్కొక్కటిగా వరుసగా ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రైశైలం నుంచి 4.40 లకల క్యూసెక్కుల నీటి ప్రవాహాం వస్తున్నట్లు తెలుస్తోంది. నీటి నిలువ సామార్థం 590 అడుగులు కాగా, ప్రస్తుతం.. 582 అడుగులకు నీరు చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం..దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున సాగర్ కు పర్యాటకులు కృష్ణమ్మ అందాలను చూడటానికి భారీగా తరలివస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter