Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ లో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసుల తీరుపై మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆధారాలు కన్పిస్తున్నా నిందితులను గుర్తించడానికి నాలుగైదు రోజుల సమయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులను ఆలస్యంగా పట్టుకోవడం.. నిందితులు వాడిన వాహనాలను వారం రోజుల తర్వాత స్వాధీనం చేసుకోవడం విమర్శలపాలైంది. అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉండటం వల్లే పోలీసులు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కారులో బాధితురాలితో కలిసి ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినా... అతన్ని కేసులో చేర్చలేదు పోలీసులు. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఏ6గా ఎమ్మెల్యే కొడుకును చేర్చి చివరగా అరెస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్ రేప్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ పోలీసులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల తీరుపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులపై పెద్ద ఎత్తున ట్రోల్ వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ కేసు నిందితులకు జూబ్లీహిల్స్ పోలీసులు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి అందించడమే తాజా వివాదం. గ్యాంగ్ రేప్ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో భాగంగా గ్యాంగ్ రేప్ జరిగిన ప్రదేశానికి నిందితులను తీసుకువెళ్లి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగానే ఆరుగురు నిందితుల కోసం పోలీసులు బిర్యానీ తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి.. బెదిరింది, హింసించి దారుణంగా కారులోనే గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తేవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు ఇతర నిందితులంతా రాజకీయ నేతల పిల్లలే. అందుకే పోలీసులు కస్టడీలో వాళ్లకు వీఐపీ మర్యదలు చేస్తున్నారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టను మంటకలిపారని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


తెలంగాణలో గతంలో సంచలనంగా మారిన దిశ గ్యాంగ్ రేప్ కేసులోనే పోలీసుల తీరు వివాదాస్పదమైంది. నలుగురు నిందితులకు చర్లపల్లి జైలులో మొదటి రోజు మటన్‌ బిర్యానీ పెట్టారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం లేపింది. పోలీసు, జైళ్ల శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులోని నిందితులకు పోలీసులు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు నిందితులగా ఉంటే పోలీసులు ఇలా చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.


Read also: National Herald Case: నేడు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్..  


Read also: Telangana schools: తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.