Jeevitha Rajasheker: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా గడువున్నా ముందస్తు వస్తుందన్న ప్రచారంతో పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్న పార్టీలు తమ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. సర్వేల ఆధారంగానే జనం నాడిని బట్టి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. కొంత కాలంగా బీజేపీలో ఫుల్ జోష్ లో ఉంది. ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు  కాంగ్రెస్ నుంచి కీలక నేతలు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. క్రీడా ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ సీనియర నటుడు జీవితా రాజశేఖర్ దంపతులు కాషాయ గూటికి చేరారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాజశేఖర్ దంపతులకు స్పష్టమైన హామీ లభించిందనే ప్రచారం సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ లో తమమైద ముద్ర వేసుకున్న జీవితా రాజశేఖర్ లు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోటీ చేయాలని జీవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సందర్భంగా తన అభిప్రాయాన్ని జీవిత చెప్పారని అంటున్నారు. సినీ , వ్యాపార రంగానికి చెందిన వాళ్లు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జీవిత ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దల నుంచి ఆమెకు హామీ ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రావుల శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీకి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఇంచార్జ్ ఎవరూ లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ కార్పొరేటర్ గా గెలిచిన బీజేపీ అభ్యర్థి కూడా ఇటీవలే టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. దీంతో జీవిత రాజశేఖర్ కు జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ వస్తుందనే టాక్ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది.


జీవితా రాజశేఖర్ లు గతంలో రాజకీయంగా యాక్టివ్ ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాంతరం జగన్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీలో చాల కాలం పనిచేశారు. తర్వాత జగన్ తమకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ  బయటికి వచ్చారు. తిరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. జగన్ గెలుపు కోసం ఏపీలో ప్రచారం చేశారు. ఇటీవలే వైసీపీకి బైబై చెప్పేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న జీవిత.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడే జీవిత పార్టీకి ప్లస్ అవుతుందన్న భావనలో కమలనాధులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో మా అసొసియేషన్ లో జీవిత కీలకంగా వ్యవహరించారు.


మరోవైపు జూబ్లీహిల్స్ నుంచే సినీ రంగానికి చెందిన మరికొందరు ప్రముఖులు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే టాక్ ఉంది.హీరో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారంటున్నారు. గత నెలలో తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ సమావేశమయ్యారు.


Also read: Facts About Chhello Show: చెల్లో షో ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది.. అసలు సినిమా కధ ఏంటో


Also read:  Janasena: జనసేనలోకి  హీరో ఆలీ.. రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook