Jampanna Vagu floods: ఊహించని విపత్తు వారిని మృత్యుఒడికి చేర్చింది. ప్రాణాలు కాపాడుకుందామని పరుగులు  తీసిన వదల్లేదు. వెంటాడి మరి విగతజీవులను చేసింది. జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి అయ్యారు. వారి కోసం పోలీసులు, గ్రామస్థులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నానికి మృతదేహాలు లభ్యమయ్యాయి. జంపన్నవాగు వరద రషీద్, కరీమా, లాల్ బీ, మహబూబ్, సమ్మక్క, మజీద్, అజ్జు, షరీఫ్ అనే ఎనిమిది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి మార్చిలో పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఎన్నడూ లేని విధంగా కొండాయి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. జంపన్న వాగు ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో.. గ్రామస్థులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. వరద పెరుగుతుండగా.. వీరంతా మాల్యాల గ్రామానికి వెళ్లేందుకు పయనమయ్యారు. రోడ్డు వెంట నడుస్తూ వెళ్తుండగా.. ఊహించని వరద ముంచెత్తి  వారిని తనలో కలిపేసుకుంది. ఈఘటన గ్రామస్థులను విషాదంలో నెట్టేసింది. బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇప్పటికీ చాలా గ్రామాలు, నగర కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తక్షణ సాయం క్రింద 25 వేల రూపాయలు అందించారు. 


Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook