Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలోనూ పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ తరపున ఆర్థిక సాయం అందించనున్నారు జనసేన చీఫ్. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సైదులు కుటుంబాన్ని పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల సాయానికి సంబంధించిన చెక్ ను అందించనున్నారు. తర్వాత కోదాడ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల చనిపోయిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరామర్శించి.. ఐదు లక్షల చెక్ అందిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో కలిసి నల్గొండ జిల్లాకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ పరిధిలోని మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీనగర్ జంక్షన్ లో కాసేపు ఆగనున్నారు.  పవన్ పర్యటనతో హైదరాబాద్ తో పాటు నల్గొండ జిల్లాలో ఆయనకు స్వాగతం చెబుతూ భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. హైదరాబాద్ శివారు నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పవన్ పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.


ఇటీవల ఏపీలో విస్తృతంగా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శిస్తూ వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రౌతుల కుటుంబాలకు సాయం చేస్తున్నారు. ఈ సందర్బంగా రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన చీఫ్. పొత్తులపైనా మాట్లాడుతున్నారు. టీడీపీ పొత్తు దిశగా సంకేతం ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీలో పవన్ కామెంట్లు కాక రేపుతున్నాయి. ఇప్పుడు పవన్ తెలంగాణలో పర్యటిస్తుండటంతో.. ఇక్కడ కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణలోనూ జనసేనకు కార్యకర్తలు ఉన్నారు. బీజేపీలో పొత్తు ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని సీట్లకు పోటీ చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.


READ ALSO: Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్


READ ALSO: Nallala Odelu:ఈటల మిత్రుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? బీజేపీలో ఏం జరుగుతోంది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook