MLA Muthireddy Yadagiri Reddy Forgery Case: జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్వయంగా ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి ఫోర్జరీ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్ధిపేట జిల్లాలోని చేర్యాలో తన సంతకాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫోర్డరీ చేశారంటూ ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చేర్యాల చౌరస్తాలో చెరువుని ఆనుకుని తనకు ఒక ఎకరం 20 గుంటల భూమి ఉందని.. ఈ భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి తనకు తెలియకుండానే కబ్జా చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ స్థలంపై గతంలో తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. పశువుల సంత నిర్వహించే స్థలాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాత్రికి రాత్రే ఆక్రమించి ప్రహారీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్షాలు కూడా పెద్ద ఎత్తలో ఆందోళన నిర్వహించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూతురు తుల్జా భవాని రెడ్డి పెట్టిన ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. తన బిడ్డ సంతకాన్ని ఫోర్జరీ చేయలేదని.. బిడ్డ పేరిట ఉన్న ప్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. కుటుంబ సమస్యలు సహజంగా ఉంటాయన్నారు. తన బిడ్డను ప్రత్యర్థులు తనపై ఈ విధంగా ఉసిగొలిపారని అన్నారు. రాజకీయంగా గిట్టనివారు ప్రతిపక్షాలు వివాదంగా మార్చారని.. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాలు తన బిడ్డ పేరుపై రిజిస్టర్ చేసి ఉందని తెలిపారు.


అందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదు. ఉప్పల్ పీఎస్ పరిధిలో మా బిడ్డ పేరుపై 125 నుంచి 150 గజాల వరకు ఉన్నది. అందులో ఎలాంటి ఫోర్జరీ జరగలేదు. ఇది  కేవలం నా కుమారుడు దానిపై కిరాయి నామ మాత్రమే నాకు తెలియకుండానే  మార్చారు. ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదు. ఈ ఆస్తి ఆమె పేరు మీదనే ఉన్నది. ఇది కుటుంబ సమస్య. ఈ కిరాయి కూడా మా అమ్మాయికే వెళ్తుంది. నేను ఏ తప్పు చేసినా ప్రజలు శిక్ష వేస్తారు. మా అధినేత సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలోనే ఉంటాను. మా రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు అనేది మా అధినేతకు తెలుసు. వివాదం సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..' అని ఎమ్మెల్యే అన్నారు.


Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: Muthireddy Yadagiri Reddy: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఫోర్జరీ కేసు పెట్టిన కూతురు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి