Jani master: నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు..
Jani master molested lady choreographer: జానీ మాస్టర్ లేడికొరియోగ్రాఫర్ ను బెదిరించి అత్యాచారం చేశారనే ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎస్ఓటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి ఈరోజు హైదరబాద్ కు తీసుకొచ్చారు.
Jani master rape case: జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత రహస్య ప్రదేశంలో ఉంచి అతని దగ్గర నుంచి వివరాలు రాబట్టారు. ఈక్రమంలో జానీ మాస్టర్ కోర్టులో హజరుపచ్చారు. అయితే.. కోర్టు రిమాండ్ రిపొర్టులో జానీ మాస్టర్ సంచలన నిజాలు బైటపెట్టారు. జూనియర్ కొరియోగ్రాఫర్ కేసులో.. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరిచినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.కేవలం ఉద్దేష్యపూర్వకంగా.. 2017 లో ఒక ప్రొగ్రామ్ లో పరిచయమైన యువతిని.. తన టీమ్ లోకి జాయిన్ చేసుకున్నారు.
ఆ తర్వాత ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. అదే విధంగా.. 2020లో ముంబయిలోని ఒక హోటల్‌లో తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లుగా పోలీసులు తెల్చారు.. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి.. జానీ మాస్టర్ పడుతునే ఉన్నాడని కూడా.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాదు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ కేసులో మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సోతోపాటు, నాన్ బెయిల్ కేసుల్ని సైతం నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు . ప్రస్తుతం కోర్టు జానీ మాస్టర్ ను.. 14 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిని ఇచ్చింది. జానీ మాస్టర్ ఘటనపై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెనుసంచలనంగా మారింది.
ఈ క్రమంలో కొంత మంది కావాలనే జానీమాస్టర్ ను ఈ కుట్రలో ఇరికించారంటూ కూడా ఆయన భార్య సుమలత ఆరోపించారు. జనసేన లో ఆయన ఎదుగుతున్నారు. అందుకే ఆయనను బలిపశువును చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అదే విధంగా.. తన భర్త ఎప్పుడు తనను మతం మార్చుకొమని బలవంతం చేయాలేదని తన ఇష్టప్రకారం జానీ మాస్టర్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
అంతేకాకుండా.. తన భర్తతప్పుచేసి ఉంటే.. నేనే వదిలేసి వెళ్లిపోతానంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. జనసేన ఇప్పటికే జానీ మాస్టర్ ను సస్పెండ్ చేసింది. టాలీవుడ్ సైతం జానీ మాస్టర్ ఘటనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నిపార్టీల నుంచి మహిళ సంఘాలు జానీ మాస్టర్ ఘటనను ఖండించాయి. తెలంగాణ మహిళ కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. జానీ మాస్టర్ ను రౌడీలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.