Jani master: మతం మార్చుకొమని పైశాచీకం.. ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు బైటపెట్టిన బాధిత యువతి..
Jani master assaulting colleague: ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఒక యువతి దారుణంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడని నార్సింగి పీఎస్ లో కేసు నమోదైంది. ఈ ఘటనలో విస్తూపోయే విషయాలను బైటపడిపట్లు తెలుస్తోంది.
Janimaster rape case shocking facts cameout: ఫెమస్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఘటన ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. దక్షిణ భారత సినీ పరిశ్రమలో జానీమాస్టర్ తనకంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఒక యువతి తనను జానీమాస్టర్ రేప్ చేశాడని, దారుణంగా హింసించాడని కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసుకున్నారు. ఈ ఘటన నార్సింగ్ పీఎస్ పరిధిలో జరగడంతో.. ఈ కేసును నార్సింగ్ పీఎస్ కు బదిలీ చేశారు.ఈ క్రమంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి సంచలన విషయాలను ఫిర్యాదుగా రాసిచ్చినట్లు తెలుస్తోంది.
మెయిన్ గా ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఒక ఛానల్‌లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయంఅయినట్లు చెప్పింది. తనకు కొరియోగ్రాఫర్ గా ఉండాని కూడా జానీ మాస్టర్ తన టీమ్ తో యువతిని ఒప్పించారంట. ఆతర్వాత.. 2019లో జానీ మాస్టర్ టీమ్‌లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ నేపథ్యంలో.. జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు ఒక హోటల్ లో బస చేశారు.
అప్పుడు.. జానీమాస్టర్ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా యువతి చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెపితే..చంపేస్తానంటూ కూడా బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో వెల్లడించింది. షూటింగ్ సమయంలో కూడా లైంగికంగా వేధించే వాడని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.
Read more: Viral Video: ముదురుతున్న వివాదం.. ముస్లిం వేషధారణలో గణపయ్య విగ్రహాం.. వీడియో వైరల్..
తనను.. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడని.. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆమె దగ్గర నుంచి లిఖీత పూర్వక ఫిర్యాదును స్వీకరించారు. ఈ క్రమంలో జానీమాస్టర్ పై.. రాయదుర్గం పోలీసులు.. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.