Jaya Jayahe Telangana Song: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి జూన్‌ 2వ తేదీతో పదేళ్లు పూర్తవుతాయి. దశాబ్దం పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు నిర్వహించగా.. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రీతిలో సంబరాలు నిర్వహించాలని ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. తాజాగా తెలంగాణ గీతంపై భారీ మార్పులు చేసింది. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని మార్పులు చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వర కల్పనలో తిరిగి పాడించనున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..


 


ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్‌ రెడ్డితో ఎంఎం కీరవాణి, అందెశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పాటలో మార్పులుచేర్పులపై అందెశ్రీతో రేవంత్‌ రెడ్డి చర్చించారు. మార్పుల అనంతరం తుది పాటను కీరవాణికి వివరించారని సమాచారం. అవతరణ దినోత్సవం సందర్భంగాపాట అద్భుతంగా రూపొందించాలని సూచించారు. దాదాపు గంటపాటు వీరు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు అందెశ్రీ, కీరవాణిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అనంతరం కీరవాణి, అందెశ్రీని ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులు ఉన్నారు.

Also Read: Chepa Prasadam: ఆస్తమా, శ్వాసకోశ బాధితులకు శుభవార్త.. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజే! 


 


మొదటి నుంచి మార్పు
మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దానికి తగ్గట్టు మార్పులు చేస్తూనే ఉంది. అందెశ్రీ రచించిన గీతాన్ని ఎన్నికలకు ముందే మార్చి రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా వాహన రిజిస్ట్రేషన్‌కు చెందిన టీఎస్‌ అనే పదంలో టీజీ అని తీసుకువచ్చారు. ఇప్పుడు అవతరణ దినోత్సవం సందర్భంగా అధికార మార్పులు కూడా చేయడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter