Government Jobs for 10th Standard Pass: మీరు పదవతరగతి వరకే చదివారా?.. పదో తరగతి తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నారా?.. పది అనంతరం ఉద్యోగం లేక సతమతమవుతున్నారా?.. ఎలాంటి నిరాశ అవసరం లేదు. పదో తరగతి పాస్ అయిన వారికి కూడా బోలెడు జాబ్స్ ఉన్నాయి. పలు  ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు అర్హులు. పదో తరగతి వరకు చదివినా.. స్టేట్, సెంట్రల్ లెవల్లో జాబ్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు జాబ్స్:
దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసుల్లో గ్రామీణ్‌ డాక్ సేవక్‌లుగా పనిచేసేందుకు గాను ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ ఉంది. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు గాను ఎలాంటి రాత పరీక్ష గానీ ఇంటర్వ్యూ గాని ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలను కేటాయిస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఇందులో ఉంటాయి. 


బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్:
పదో తరగతి పాస్ అయిన వారికి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. దీనిలో గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు ఉటాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాలు కూడా ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ పోస్టులు ఉన్నాయి. 


ఆర్మీ జాబ్స్:
పదో తరగతి పాస్ అయిన వారికి రైల్వే రంగంలో చాలా జాబ్స్ అందుబాటులో ఉంటాయి. సెక్యూరిటీ, గార్డ్స్, లైన్ మెన్ లాంటి ఎన్నో జాబ్స్ ఉంటాయి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోనూ ఉద్యోగాలు ఉంటాయి. అలానే ఆర్మీ జాబ్స్ కూడా పదో తరగతి పాస్ అయిన వారు అర్హులే. 


అంగన్‌వాడీ పోస్టులు:
స్టేట్ లెవల్లో కూడా పలు జాబ్స్ పదో తరగతి పాస్ అయిన వారికి ఉన్నాయి. అంగన్‌వాడీ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుకు మహిళలు అర్హులు. ఇందులో అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టులున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా పలు జాబ్స్ ఉంటాయి. ప్రాథమిక ఆరోగ్య శాఖలో కూడా జాబ్స్ ఉన్నాయి. 


Also Read: ENG vs IND 5th Test: రోహిత్‌కు కరోనా.. కోహ్లీ, పూజారా ఫామ్‌పై అనుమానాలు! ఇక ఆశలన్నీ వారిపైనే


Also Read: Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి