తెలంగాణ పోలీసుశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. జోగిపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ (SI Prabhakar) కరోనా బారిన పడి చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ గురువారం రాత్రి కరోనాతో పోరాడుతూ (SI Prabhakar Dies of Covid-19) మరణించాడు. ఆయన స్వస్థలం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం సత్యగామ. ప్రస్తుతం ఆయన జోగిపేట (Jogipet) పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. Corona Vaccine: రెండు వారాల్లో రష్యా కరోనా వ్యాక్సిన్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సోకడంతో అయిదు రోజుల కిందట గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి ఆయనను తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో గురువారం రాత్రి ఎస్ఐ ప్రభాకర్ చనిపోయారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్


కాగా, జోగిపేట పోలీసుశాఖలో ఇది రెండో కరోనా మరణం. అయిదు రోజుల కిందట జోగిపేట ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహించిన చాకలి వెంకటేశం(47) కోవిడ్19 బారిన పడి మరణించడం తెలిసిందే.  Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 


వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్