Justice NV Ramana: `హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు నా కల`..
Justice N.V.Ramana: హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు సీజీఐ జస్టిస్ ఎన్.వి. రమణ కృతజ్ఞతలు తెలిపారు.
Justice N.V.Ramana: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు సీజే నివాసంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం(International Arbitration Center) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారు. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైంది. దుబాయ్(Dubai)లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైంది. ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తుంది. ఆర్బిట్రేషన్ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం హామీ ఇచ్చారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు(Justice Lavu Nageswara Rao)తీసుకోవాలని కోరుతున్నాను. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను’.
Also Read: SC judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకంపై మీడియాలో వార్తలపై CJI ఫైర్
‘ఆర్బిట్రేషన్ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టం. హైదరాబాద్(Hyderabad)లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం. దీని కోసం 3 నెలల కిందట ప్రతిపాదన చేశాను. నా స్వప్నం సాకారానికి 3 నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదు. నా ప్రతిపాదనకు సీఎం కేసీఆర్(CM KCR) వెంటనే స్పందించారు. ఈ కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. నా కల సాకారానికి కృషి చేస్తున్న కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీ(Justice Hima Kohli)కి కృతజ్ఞతలు’ అని సీజేఐ అన్నారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ..(PV Narasimha Rao) దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, పీవీ హయాంలోనే ఆర్బిట్రేషన్ చట్టం రూపుదిద్దుకుందని జస్టిస్ ఎన్.వి. రమణ( Justice N.V.Ramana) స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook