Chief Justice Ujjal Bhuyan: రేపే రాజ్‌భవన్‌లో కొత్త సీజే ప్రమాణస్వీకారం..సీఎం కేసీఆర్ హాజరుపై సస్పెన్స్..!
Chief Justice Ujjal Bhuyan: రేపు (మంగళ వారం)తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి.
Chief Justice Ujjal Bhuyan: రేపు (మంగళ వారం)తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం జరుగుతుంది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈకార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.
ఐతే ఆయన వెళ్తారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. సీఎంవో నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. గతకొంతకాలంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె ఆహ్వానం అందడం లేదు. ఈపంచాయతీ ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలోనే సీఎం కేసీఆర్ తీరుపై గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్ చేశారు. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆహ్వానం అందింది. రేపటి ఉదయంలోపు వెళ్లడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రగతిభవన్ నుంచి రాజ్‌భవన్‌కు దూరమేమి లేదని..అప్పటికప్పుడు ఆయన వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈనెలాఖరులో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని గుర్తించి తగిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ రేపు(మంగళవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈసందర్భంగా మంగళవారం రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొనప్ప ఐలాండ్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వీవీ విగ్రహాం జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మొనప్ప ఐలాండ్, వీవీ విగ్రహాం జంక్షన్, పంజాగుట్ట, రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డు మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇందుకు తమకు సహకరించాలని నగర పోలీసులు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ రోడ్డులో పార్కింగ్ స్థలాలను సైతం ఖరారు చేశారు. గేట్-3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు, దిల్ ఖుష గెస్ట్ హౌస్‌లో మీడియా వాహనాలకు కేటాయించారు.
ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్‌లో వీఐపీ, గవర్నమెంట్ అధికారుల వాహనాలు ఆగనున్నాయి. మెట్రో రెసిడెన్సీ టూ నాసర్ స్కూల్ లైన్‌లో సింగిల్ లైన్ పార్కింగ్ ఉండనుంది. లేక్‌వ్యూ నుంచి వీవీ విగ్రహాం వరకు సింగిల్ లైన్ పార్కింగ్‌కు కేటాయించారు. ఈమేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ అధికారిక ప్రకటన వెలువరించారు.
Also read:India vs England: ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఎవరు..అతడికి ఈసారి అవకాశం ఉంటుందా..?
Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో హైఅలర్ట్..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి