Kadiyam Kavya - Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..
Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Kadiyam Kavya - Manda krishna Madiga: వరంగల్ లోక్‌సభ అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తోన్న డాక్టర్ కావ్య కులంపై ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ముస్లిమ్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కావ్య ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ కాదని వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఆమెది ఏ కులమే కావ్య తండ్రి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. హనమకొండ బాల సముద్రంలో మీడియాతో మంద కృష్ణ మాట్లాడుతూ.. ముస్లిమ్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే.. కావ్యకు ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదన్నారు. అంతేకాదు ఆమె కులంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
అంతేకాదు ఆమె కులంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఎస్సీ కాదని వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే తన కులం ఏమిటో కడియం శ్రీహరి ప్రూవ్ చేసుకోవాలన్నారు.
ముస్లిమ్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న కావ్యకు ముస్లిమ్ మతమే వర్తిస్తుందన్నారు. అపుడు ఆమె ముస్లిమే అవుతుందన్నారు. కావ్య ఒకవేళ వరంగల్ ఎంపీ బరిలో గెలిస్తే.. ఉప ఎన్నిక తప్పదన్నారు. ఇక్కడి ఓటర్లు విజ్ఞతతో ఓటుతో వేయాలని కోరారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత అనూహ్యంగా ఈ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున లోక్ సభ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు.
Also read: Asaduddin Owaisi: ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook