Kalvakuntla Kavitha Going to Delhi with Her Brother KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ కీలకంగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆమె మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా ఢిల్లీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారని ఆమెను కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే అని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ నెల 11వ తేదీన కవితను ఢిల్లీ వేదికగా ఈడీ అధికారుల విచారించారు. ఆ రోజునే ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆమె సోదరుడు కేటీఆర్ బావ హరీష్ రావు సహా పలువురు తెలంగాణ మంత్రులు తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆమెను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉండే అవకాశం కూడా ఉందని భావించారు. అయితే ఆమెను ఈడీ అరెస్ట్ చేయలేదు, తర్వాత 16వ తేదీ విచారణకు రమ్మని కోరింది. కానీ కవిత మాత్రం ఆ విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కవిత ఈడీ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని, మహిళలనూ, చిన్న పిల్లలను వారి ఇళ్లలోనే దర్యాప్తు చేయవచ్చని రూల్స్ ఉన్నా పట్టించుకోవడంలేదని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.


కవిత పిటిషన్ను 24వ తేదీన విచారిస్తామని న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. అయినా సరే ముందే విచారణ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆమె మరోసారి పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ పిటిషన్ ను మాత్రం సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదు. అయితే కవిత విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న కేవియెట్ దాఖలు చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ వాదనలు పూర్తయిన తరువాతే తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. ఇక 20వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె మరోసారి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.


హైదరాబాదు నుంచి ఢిల్లీకి బయలుదేరిన కవిత వెంట ఆయన ఆమె సోదరుడు మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు కవిత ఈడి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. కోర్టులో పిటిషన్ వేసాను కాబట్టి ఆ విషయంలో క్లారిటీ వచ్చేవరకు తాను ఈడి విచారణకు హాజరు కాను అని కవిత లేఖ రాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె వెంట కేటీఆర్ సంతోష్ ఎందుకు వెళ్లారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే కవిత రేపు కూడా విచారణకు హాజరు కాకపోతే పరిస్థితి ఏమిటనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఈడీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. 


Also Read: 'Natu Natu': ఢిల్లీ చాందిని చౌక్ వ‌ద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన‌ జ‌ర్మ‌న్ అంబాసిడర్


Also Read: Corona Returns: H3N2 టెన్షన్లో ఉండగానే మరో బాంబు.. నాలుగు నెలల తరువాత ఒక్కరోజులో వెయ్యికి పైగా కేసులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook