MonkeyPox: తెలంగాణ వైద్యశాఖ ఊపిరి పీల్చుకుంది. తెలంగాణ ప్రజలు హమ్మయ్య అనుకుంటున్నారు. కొవిడ్ మహమ్మారి తరహాలో ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీఫాక్స్ లక్షణాలు కామారెడ్డి వ్యక్తిలో కనిపించడంతో అధికారులు ఆందోళనకు లోనయ్యారు. బాధితుడి స్వగ్రామంలో అయితే భయాందోళన నెలకొంది. కామారెడ్డి వ్యక్తిని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ లో ఉంచిన వైద్యులు.. అతని శాంపుల్స్ సోమవారం పుణె వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. తాజాగా అతని రిపోర్ట్ వచ్చాయి. మంకీఫాక్స్ లక్షణాలు ఉన్న కామారెడ్డి వ్యక్తికి నెగెటివ్ వచ్చింది. మంకీఫాక్స్ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు వైద్య శాఖ అధికారులు. అతనికి చికెన్ పాక్స్ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతను జూలై 6న ఇతను దుబాయ్ నుంచి వచ్చాడు. ఈనెల 20వ తేదిన అతనికి జ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత శరీరంపై విపరీతమైన దద్దుర్లు వచ్చాయి. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటలకు వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతనిలో మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కామారెడ్డి జిల్లా  ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి 108 వాహనంలో హైదరాబాద్ ఫీవర్‌‌ హాస్పిటల్‌కు తరలించారు. మంకీఫాక్స్ లక్షణాలున్న వ్యక్తి శాంపిల్స్ సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. అతన్ని ఫీవర్‌‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. మంకీఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తిని కలిసిన ఆరుగురిని గుర్తించి పరీక్షించగా.. వాళ్లలో ఎలాంటి మంకీఫాక్స్ లక్షణాలు కనిపించలేదు.


ప్రపంచ వ్యాప్తంగా మంకీఫాక్స్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.  75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు  16 వేల‌కు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చ‌నిపోయారు.మనదేశంలో ఇప్పటివరకు నలుగురికి మంకీఫాక్స్ సోకింది. ఇందులో ముగ్గురిది కేరళ రాష్ట్రం కాగా.. మరొకరిది ఢిల్లీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్ విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.  కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ ను నోడల్ ఎజెన్సీగా ప్రకటించింది. 


Read also: KTR: కాలుకు గాయమైందని కేటీఆర్ డ్రామా చేస్తున్నారా? అసలు కారణం ఇదేనా?  


Read also: CM JAGAN:సీఎం జగన్ పెన్ను తీసుకున్న చిన్నారి... ఆ పెన్ను ఖరీదు 70 వేలకు ఎక్కువే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి