KARATE KALYANI PRESS MEET : `కరాటే కల్యాణి పారిపోదు.. పరిగెత్తిస్తది`
KARATE KALYANI PRESS MEET : తనపై వస్తున్న ఆరోపణలపై కరాటే కల్యాణి స్పందించారు. ఎవరెవరు వెనకుండి నడిపిస్తున్నారో తనకు తెలుసన్నారు. త్వరలో అన్ని వివరాలు చెప్తానన్నారు కరాటే కల్యాణి.
KARATE KALYANI PRESS MEET : తనపై వస్తున్న ఆరోపణలపై కరాటే కల్యాణి స్పందించారు. ఎవరెవరు వెనకుండి నడిపిస్తున్నారో తనకు తెలుసని.. త్వరలో అన్ని వివరాలు చెప్తానని కల్యాణి స్పష్టం చేశారు. అన్యాయం జరిగితే సహించని వ్యక్తిత్వం ఉన్న తననే అన్యాయం చేశావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఏ ఆడపిల్లకు ఇలాంటి కష్టం రావొద్దని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది మీద పైట్ చేస్తా కాబట్టే.. తనంటే నచ్చని వాళ్లుంటారని... తనపై కుట్రల్లో రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
తన ఇంట్లో పిల్లలు శివాజీ, ఝాన్సీలా పెరగాలని ఆలోచిస్తానని.. తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరటానికి సిద్ధమని అన్నారు. తాను పిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నానా అని ప్రశ్నించారు. తనేదో ట్రీట్‌మెంట్ కోసం వెళ్తే.. దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నవారు ఆధారాలు చూపించ గలరా అని ప్రశ్నించారు. ఫోన్ ప్రాబ్లెం ఉండి స్విచ్ ఆఫ్ అయితే పారిపోయానని ప్రచారం చేశారన్నారు. ఎక్కడికీ పారిపోలేదని వివరించారు. ఒక ఆడపిల్లపై ఇంత నీచమైన ప్రచారం చేస్తారా.. నాపై ఇంత జరుగుతుందేంటని ఏడ్చానని కల్యాణి కన్నీటి పర్యంతమయ్యారు. తన చావు కావాలంటే చచ్చిపోతానని.. కానీ ఒక్క ఆడదాన్ని ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కల్యాణి.
గతంలో సింగరేణి కాలనీలో ఓ అమ్మాయికి సమస్య వస్తే.. సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఓ పోస్టు పెడితే తనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారని వాపోయారు కల్యాణి. చివరికి కోర్టే ఆ కేసు పెట్టిన వాడికి మొట్టికాయలు వేసిందన్నారు. తాను పిల్లల్ని అమ్ముకునే స్థితిలో లేనని స్పష్టం చేశారు. తనకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేస్తానంది. రామ్‌గోపాల్ వర్మ దాచాడా, శ్రీ రెడ్డి దాచిందా అంటూ థంబ్‌నైల్స్ పెట్టి.. తనపై నీచమైన ఆరోపణలు చేశారని వాపోయారు.
"నా కర్మ కాలి నాకు అబార్షన్ అయి పిల్లల్ని కనే అవకాశం పోయింది. నాకు ప్రాబ్లెమ్ అయి పిల్లలు పుట్టలేదు కాబట్టి పిల్లలు కావాలని కోరుకుంటే తప్పా. పెళ్లైన తర్వాత నాకు అబార్షన్ అయింది. నాకు ఆ బాధ ఉంది. నేను ఈ పాపను దత్తత తీసుకోలేదు. తీసుకోవాలి అనుకున్నా. ఏడాది పాపను దత్తత తీసుకోవటం కుదరదు కాబట్టి వెయిట్ చేస్తున్నా. పాప తల్లిదంద్రులకు ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాలేదు. పాప తల్లిదండ్రులు నాతోనే ఉంటారు."-కరాటే కల్యాణి
అవకాశం కోసం ఎదురుచూసిన వాళ్లు శ్రీకాంత్ రెడ్డితో ఇష్యూ తర్వాత తనపై దుష్ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టారని కల్యాణి ఆరోపించారు. తను ఏ తప్పు చేశానని ఇంటిని రైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఏ ఆధారాలున్నాయని తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డబ్బులకు పిల్లల్ని అమ్ముకున్నానని ఆరోపణలు హాస్యాస్పదమమన్నారు కల్యాణి.
శ్రీకాంత్ రెడ్డి ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదన్నారు. తనెవరో తెలియదని శ్రీకాంత్ అన్నాడని, అలాంటి వాడ్ని డబ్బులు ఎలా డిమాండ్ చేస్తానని ప్రస్నించారు. తన ఇంటికొచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. కల్యాణి అంటే ఏంటో నిజం తెలుసుకుని రాయాలని కోరారు.
"మా అమ్మ నాతో ఉండదు. ఆమెకు దత్తత విషయం తెలియదు. అసలు మా అమ్మకు ఏం చెప్పం. ఎందుకంటే ఇంత మందిని ఎందుకు పోషిస్తావని అడుగుతది. మా అమ్మ నాతో ఉండరు. కానీ మా తమ్ముడు మాల వేసుకోవటం వల్ల వచ్చారు. కానీ.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన రోజు మా అమ్మ కూడా ఇంట్లో లేరు. ఆ రోజు అసలు ఇంట్లో ఎవరూ లేరు. అలాంటప్పుడు పాపను ఎవరికివ్వాలి. అందుకే తీసుకెళ్లా. నేను ప్లాన్ చేసి శ్రీకాంత్ రెడ్డి మీదకు వెళ్లేటప్పుడు పాపను తీసుకెళ్తే అనాలోచితం. కానీ వెళ్లి ప్రశ్నించిన క్రమంలో పరస్పరం దాడి జరిగింది తప్ప పాపను కావాలని తీసుకెళ్లలేదు. నేను తప్పు చేసినట్లయితే కేసుకు సిద్ధం. కేసు కొట్లాడుతా."-కరాటే కల్యాణి
పాపకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అలాంటి నేను పిల్లల్ని అమ్ముతున్నానని... ఎవరో చెప్తే ఎలా రాస్తారని ప్రశ్నించారు కల్యాణి. సంవత్సరం తర్వాత పాప మౌక్తికను మీ అందరికీ చెప్పి దత్తత తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
"గతంలో నేను ఇల్లు కొంటానికి ఆరున్నర లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. అది వేరే వాళ్లకు అమ్మేశారు. నా డబ్బులు నాకివ్వాలి, నేను అప్పుడిచ్చా, తిరిగి వడ్డీ కలిపి ఇవ్వాల్సిందేనని అడిగా. దానిపై పోలీసులు వాళ్లనే.. కల్యాణిని మోసం చేశారని తిట్టారు" అని కల్యాణి వివరించారు.
తనపై లేనిపోని ఆరోపణలు వస్తున్నందునే వెస్ట్ జోన్ డీసీపీని కలుద్దామనుకున్నామని కల్యాణి అన్నారు. రేపు(మంగళవారం) కలెక్టర్‌ను కలుస్తామన్నారు. లీగల్‌గా తప్పుందంటే దేనికైనా రెడీ అని సవాల్ చేశారు. తాను పారిపోయే రకం కాదన్నారు కల్యాణి. రాంగ్ థంబ్‌నైల్స్, రాంగ్ కంటెంట్ పెట్టే వారిపై పోరాటం చేస్తానన్నారు కల్యాణి. తనపై చాలా మంది పతివ్రతలు వాగుతున్నారని తెలిసిందని.. వర్షిణి అనే అమ్మాయి వివరాలు కూడా బయటపెడతానని కల్యాణి పేర్కొన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారికి ధన్యవాదాలని.. అందువల్లే తన నిజాయితీ బయటపడిందన కల్యాణి స్పష్టం చేశారు.
బీజేపీలో ఉన్నానని తనపై రాజకీయ కుట్ర కూడా చేస్తున్నారని కల్యాణి ఆరోపించారు. తప్పు చేయనంత వరకు తల వంచనని కల్యాణి స్పష్టంచేశారు. మంచి పనులు చేస్తే కూడా ఇబ్బంది పడుతారనేందుకు తానే ఉదాహరణ అన్నారు. కరోనా టైమ్‌లో వందల మందికి ఆస్తి లేకున్నా సేవ చేసిన చరిత్ర తనకుందన్నారు కల్యాణి.
తను పెంచుకుంటున్న కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడని.. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన పిల్లల్ని బాధ పెట్టొద్దని కోరారు. తాను వద్దన్నా బిగ్ బాస్‌లో తన కొడుకు గురించి మాట్లాడింది వద్దన్నా కూడా పెట్టారని.. దానికే తన కొడుకు తనను అడిగాడని కన్నీటి పర్యంతమయ్యారు.
కేటీఆర్ జిల్లా సిరిసిల్లలో ముళ్లపొదల్లో చిన్నారిని పడేస్తే.. నేను అప్లై చేసుకున్నానంది. కేటీఆర్ గారే ఈమెకు ఇవ్వగలవా అని ట్వీట్‌లో అడిగితే.. రూల్స్ ప్రకారం ఇవ్వాలన్నారు. తాను తన కొడుకును లీగల్‌గానే తెచ్చుకున్నానని వివరించారు. తాను శిక్షార్హురాలిని కానే కాదని.. కలెక్టర్‌ను కలిసి అన్నీ వివరిస్తానని కల్యాణి పేర్కొన్నారు. తాను ఇల్లీగల్ పనులు చేయట్లేదని. తనకు సంబంధించి వార్తలు కావాలంటే... సంప్రదించి రాయాలని కోరారు కల్యాణి. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు నమ్మి ఎవరైనా ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని, తాను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఎంత మంది చూస్తారని ప్రశ్నించారు. తనకు పాప దత్తతకు రాకున్నా... పాపకు, వాళ్ల కుటుంబానికి సహకరిస్తానని కల్యాణి స్పష్టంచేశారు.
తనను రోడ్డుకీడుస్తామని చెప్పిన వాళ్లకి అధికార పార్టీ సహకారం కూడా ఉందని ఆరోపించారు. తానెన్నడూ నిజాయితీ తప్పలేదన్నారు. తనపై కుట్రతో గతంలో ఫోక్సో కేసు కూడా పెట్టారని ఆరోపించారు. శివశక్తి అనే సంస్థ నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కల్యాణి ఆరోపించారు. తనపై ముప్పేట దాడి వెనుక తనను పార్టీలో ఉండకుండా చేస్తామని ఛాలెంజ్ చేసిన వాళ్ల కుట్ర ఉందన్నారు కల్యాణి.
కరాటే కల్యాణి అంటే ఇకపై మూవీ ఆర్టిస్టును కాదని... కరాటే కల్యాణి అంటే.. ఇకపై.. రాష్ట్రీయ హిందూ జేఏసీ జాతీయ మహిళ అధ్యక్షురాలు, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి, జాతీయ మహిళ అధ్యక్షురాలు.. అన్యాయం ఎక్కడ జరిగినా, అమ్మాయిల పట్ల ఎవడు అసభ్యంగా ప్రవర్తించినా స్పందిస్తానని కల్యాణి స్పష్టం చేశారు.
అక్కపై నమ్మకంతోనే...
పాప తల్లిదండ్రులు కూడా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తనో ఆటో డ్రైవరునని, తన భార్య స్వప్న మూడో డెలివరీ అయినప్పుడు ఆరోగ్యం బాలేదని.. 25రోజులు పాపకు ఫీడింగ్ కూడా లేదని.. పాప తండ్రి గోవర్థన్ వివరించారు. వాళ్ల ఏరియాలో ఉండే అన్నకు తన సమస్య చెప్పానని.. అప్పుడతను కల్యాణి అక్క గురించి చెప్పాడని వివరిచారు. హెల్పింగ్ నేచర్ ఉంది అని చెప్తే శ్యామ్ అన్న ద్వారా అక్కను కలిశామని.. పాపను తీసుకెళ్లామని గోవర్దన్ స్పష్టం చేశారు. దత్తత తీసుకోవటం ఇప్పుడే కుదరదని కల్యాణి అప్పుడే చెప్పారని.. తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడైతే కలిసి ఉందాం అని చెప్పారని వివరించారు. అలా అంతా కలిసి ఉంటూ పాపను చూసుకుంటున్నామన్నారు. పాప భవిష్యత్తు కోసం ఆలోచించి... అక్కతోనే కలిసి ఉంటున్నామన్నారు. అక్క బాబును మంచి స్కూల్లో చేర్పించిందని.. అలా నమ్మకం కలిగి అక్కకు ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు.
Also Read - Katrina Kaif Pics: పాలరాతి శిల్పంగా కత్రినా కైఫ్.. మల్లీశ్వరి నవ్వులు మాములుగా లేవు!
Also Read - Unseasonal rains: అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల రైతులకు తీరని నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook