Namo Navmatdata Sammelan: గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిదేనని అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ లేని భారత్‌ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాస్ పోర్టు కంటే విలువైన వజ్రాయుధం ఓటు-ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు. నవ యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ స్థానంలో ఉన్న భారత్‌ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా మారడం తథ్యమన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం తిమ్మాపూర్‌లోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘నమో నవ మత్ దాత’ (నవ యువ ఓటర్ల సమ్మేళనం) కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యక్ష ప్రసారాలను వీరంతా వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. 


"భారత దేశ పునాదులు ప్రజాస్వామ్యమంపై నిలబడ్డాయి. ఆ ప్రజాస్వామ్యంలో కీలకమైనది ఏది..? ఓటు హక్కు. ఈ దేశంలో అంబానీ నుంచి ఆమ్ అద్మీ వరకు సమానమైన హక్కు కలిగిన ఉన్నది ఏది..? ఓటు మాత్రమే. ఎంత డబ్బున్నోడైనా, లేనోడైనా ఒకే ఓటు ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాన్యుడికి ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు. అంతటి పవర్ ఫుల్ వెపన్ మీకొద్దా..? ఓటుకున్న పవర్ ఏందో మీలో ఎంతమందికి తెలుసు..? బాధాకరమేందంటే.. చదువుకున్నోడికంటే చదువురానోడే ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకుంటున్నాడు. చదువుండి, పైసలుండి, పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసే శక్తి ఉన్నా ఓటేయని వాళ్లలో చదువుకున్నోళ్లే ఎక్కువ. ఇంకా బాధాకరమేందంటే… మీ లాంటి యువ ఓటర్లే ఎక్కువ మంది ఉన్నరు.


దేశం తలరాతను మార్చే శక్తి యువతకే ఉంది. కొండల్ని పిండి చేసే దమ్ము మీలాంటి యువతకే ఉంది. ఈ దేశ తలరాతను మార్చిన భగత్ సింగ్ ఏ వయసులో పోరాడిండు? ఈ దేశ ఖ్యాతి, సంస్క్రుతి, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద ఏ వయసులో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు..? మరి మీరేం చేస్తున్నారు..? 


ఓటనే వజ్రాయుధాన్ని కల్పించినా మీరు ఉపయోగించుకోవడం లేదు? ఇది కరెక్ట్ కాదు… మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేదెవరో ఎంచుకోవాలంటే ‘ఓటు’ అనే వజ్రాయుధాన్ని వాడండి. ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను నెంబర్ వన్ గా చేయాలనే సంకల్పంతో అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడెవరో గుర్తించి ఎంచుకోవాలంటే ‘ఓటు’ అనే పవర్ ఫుల్ వెపన్ ను వాడండి. ఓటు వేసే తెలివి, కలిమి, బలిమి మాకున్నాయి. తప్పు చేసేటోడిని ఓటనే ఆయుధంతో ఓడిస్తాం… మంచి చేసేటోడిని ఓటనే ఆయుధంతో గెలిపిస్తామనే సంకేతాలు పంపాలంటే మీరేం చేయాలి? ముందు ఓటర్ గా నమోదు చేసుకోవాలి. ఓటు విలువ తెలుసుకోండి. ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి. ఎన్నికల్లో పోటీ చేసే అవినీతిపరులను, వారసత్వ రాజకీయాలతో స్వార్ధ రాజకీయాలు నడిపే నాయకులను ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి.." అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


Also Read: Tricolour Spinach Tomato Rice: ఈ గణతంత్ర దినోత్సవానికి ఇలా కొత్తగా ట్రై చేయండి!


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook