Hyderabad: రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు.. అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు..
Karnataka: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రద్దీగా ఉన్న కేఫ్ లో బాంబు పేలడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్త సిక్తంగా మారిపోయింది. అక్కడున్న వారంతా భయంతో పరుగులుపెట్టారు.
Bengaluru Rameshwaram Cafe Blast High Alert In Hyderabad: కర్ణాటకలోకి బెంగళూరులోని శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా రామేశ్వరం కేఫ్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో నిముషాల్లోనే మంటలు కేఫ్ అంతా వ్యాపించాయి. అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. అస్సలు అక్కడ ఏ జరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
పదుల సంఖ్యలో కేఫ్ కు వచ్చిన వారు గాయపడ్డారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకి చేరుకున్నారు. తొలుత కిచెన్ లోని గ్యాస్ సిలిండర్ పేలిందని అందరు భావించారు . కానీ పేలుడుపై సీఎం సిద్ధరామయ్య, బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.
రామేశ్వరం కేఫ్ శుక్రవారం రద్దీగా ఉంది. ఈక్రమంలో ఒక్కసారిగా మధ్యాహ్నం పేలుడు సంభవించింది. దీంతో కేఫ్ లోని సిబ్బంది,కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా శబ్దం రావడంతో.. అక్కడి ప్రాంతంలోని కస్టమర్లు ఏంజరిగిందో అని షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై ఉగ్రకోణం ఉన్నట్లు సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు.
అదే విధంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సైతంపలు ఉగ్రకదలికలు ఉన్నట్లు భావిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. కేఫ్ లో ఒక కస్టమర్ బ్యాగ్ వదిలి వెళ్లడం వల్లనే బాంబు పేలుడు సంభవించిందని తేజస్వీ యాదవ్ ట్విట్ చేశారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనేక చోట్ల తనిఖీలు చేపట్టారు. కీలక ప్రాంతాలు, అనుమానస్పదంగా ఎవరు కన్పించిన కూడా తనిఖీలు చేపట్టాలని సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
Read More: Sreeleela: బ్లాక్ శారీలో శ్రీలీల నడుమందాలు చూడతరమా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
కాగా, బెంగళూరు బాంబు పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కేఫ్ ప్రాంతంలో ఇప్పటికే క్లూస్ టీం చేరుకుంది. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీనిపై ఎన్ఐఏ ఆరా తీస్తుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఘటనలో 9 మంది గాయపడినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook