Kavitha on Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చని..ఇక్కడి విషయాలు తెలుసుకుని వెళ్లొచ్చన్నారు. త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ రానున్నారు. ఈక్రమంలో ఆయన టూర్‌పై కవిత స్పందించారు. రాహుల్ గాంధీ అసలు ఇండియాలో ఉన్నారా అని చురకలు అంటించారు. సిరిసిల్లకు వచ్చి..ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను ఆయన సొంత నియోజకవర్గం వయానాడ్‌లో అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని..ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పాలన్నారు. భారీ వరదలతో తెలంగాణ రాష్ట్రం వణికిపోతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రావడం లేదని తెలిపారు. 


రాష్ట్రంలో వరదలు కొనసాగుతున్నా కేంద్రం నుంచి ఎవరూ రాలేదని విమర్శించారు. తక్షణమే తెలంగాణకు సహాయ నిధి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు అందుతున్న సాయం తెలంగాణకు రావడం లేదని ఫైర్ అయ్యారు.


Also read:Margaret Alva: జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఢీకొట్టనున్న మార్గరెట్ అల్వా..ఇంతకు ఎవరీ మహిళ..?


Also read:CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ 'పది' ఫలితాలు విడుదల..రిజల్ట్ ఇలా చూసుకోండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.