కామారెడ్డి ఆశీర్వాదసభలో ఆంధ్రాపాలకులపై కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంఅంధకారంగా మారుతుందని..ఎడారిగా మారుతుందని ఆంధ్రా పార్టీ నేతలు మమ్మల్ని భయపెట్టారు. ఇవన్ని పచ్చి అబద్దాలని తెలంగాణ వచ్చిన తర్వాత తెలిసిందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో కంటే తెలంగాణ ప్రజలకు సాగు తాగు నీటి అవసరాలనున తీర్చుతున్నామని కేసీఆర్  తెలిపారు. రైతు బంధు పథకం, రైతు భీమా లాంటి పథకాలు అమలు చేసి ఏపీలో కంటే తెలంగాణలో రైతు పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టులు పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.  ఏ పథకం చూసినా ఏపీ కంటే మనం ఫలితాలు సాధిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.


పార్టీలు కాదు..ప్రజలు గెలవాలి
కాంగ్రెస్ 53 ఏళ్లు..టీడీపీ 17 ఏళ్లు పాలించి తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ వాళ్లకు 70 ఏళ్లు పాలించినా.. దానికి సమయం చాల్లేదా అంటూ కేసీఆర్ ఎద్దేవ చేశారు. కాంగ్రస్ వోళ్లు తెలివిలేని దద్దమ్మలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటను కాంగ్రెస్ గెలిస్తే  తెలంగాణలో చీకటి తప్పదని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి..మహాకూటమి గెలిస్తే పార్టీలు గెలిచినట్లేనని.. ప్రజలు..వారి ఆకాంక్షలు గెలవాలంటే టీఆర్ఎస్ ఓటు వేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలను కోరారు.